News May 15, 2024
నెల్లూరు రూరల్ రూలర్ ఎవరో..?

నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని ఏలబోయే నాయకుడెవరనేది తీవ్ర ఉత్కంఠగా మారింది. జిల్లాలో నువ్వా-నేనా అన్నట్లు పోటీపడుతున్న స్థానాల్లో రూరల్ ఒకటి. 66.18 శాతం మంది ఓటర్లు ఓటు వేశారు. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ఆదాల ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్ని ప్రయత్నాలు చేశారు. ప్రజలు మాత్రం సైలెంట్‌గా ఓటేసి తమ బాధ్యతను నిర్వర్తించారు. జూన్ 4 తర్వాత రూరల్ రూలర్ ఎవరో తేలనుంచి.
Similar News
News November 1, 2025
నెల్లూరు లేడీ డాన్ అరుణకు రిమాండ్

నెల్లూరు లేడీ డాన్ అరుణకు మరో కేసులో కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని నగదు వసూలు చేసి మోసం చేసినట్లు బాధితులు సూర్యారావుపేట Ps లో ఫిర్యాదు చేశారు. దీంతో నెల్లూరు జిల్లా జైలులో ఉన్న ఆమెను విజయవాడ పోలీసులు శుక్రవారం పీటీ వారెంట్ పై అదుపులోకి తీసుకున్నారు. అనంతరం న్యాయస్థానంలో హాజరుపరిచారు. కాగా కోర్టు 14 రోజుల రిమాండ్ వేయడంతో తిరిగి కేంద్ర కారాగారానికి తరలించారు.
News November 1, 2025
నెల్లూరు: KGBV హాస్టళ్లలలో పోస్టులు

నెల్లూరు జిల్లాలోని KGBV లలో PGT, CRT గెస్ట్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. లింగసముద్రం, కందుకూరు, సీతారామపురం, కలిగిరి కేజీబీవీలలో ఆయా ఖాళీల సబ్జెక్టులకు సంబంధించి గంటకు రూ. 2చొప్పున చెల్లిస్తామన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈ నెల 4 లోపు ఎంఈఓ కార్యాలయాల్లో దరఖాస్తులు అందజేయాలన్నారు.
News November 1, 2025
పంటలకు ఆర్థిక సాయం పెంపు : మంత్రి కొలుసు

పంటలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచామని మంత్రి కొలుసు పార్థసారథి చెప్పారు. గతంలో ధరల స్థిరీకరణకు రూ.3వేల కోట్లు కేటాయించగా.. తాము రూ.6 వేల కోట్లకు పెంచామన్నారు. మామిడికి రూ.260 కోట్లు, పొగాకు రూ.273 కోట్లు, కోకోకు రూ.14 కోట్లు, కాఫీకి కిలోకు రూ.50 చొప్పున కేటాయించినట్లు పేర్కొన్నారు. గత ప్రభుత్వం 40 లక్షల మెట్రిక్ టన్నులు కొంటె.. తమ ప్రభుత్వం 53.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిందన్నారు.


