News January 31, 2026

నెల్లూరు: రూ.20లక్షల జీతాన్ని వదులుకుని..!

image

నెల్లూరు జిల్లా దుత్తలూరుకు చెందిన రిటైర్డ్ జవాన్ గంగాధర్ కుమారుడు భారతాల ఉదయ్ శంకర్ గ్రూప్-1 ఫలితాల్లో సత్తాచాటాడు. చిన్నప్పటి నుంచి ప్రభుత్వ స్కూళ్లలో చదివాడు. రూ.20లక్షల ప్యాకేజీతో సాప్ట్‌వేర్ జాబ్ చేసేవాడు. ప్రభుత్వ ఉద్యోగమే లక్ష్యంగా ఆ జాబ్ వదిలేశాడు. కష్టపడి గ్రూప్-1లో పాస్ కావడంతో అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ స్టేట్ టాక్స్ ఉద్యోగానికి ఎంపికయ్యాడు. అతనికి పలువురు అభినందనలు తెలిపారు.

Similar News

News February 6, 2026

తత్కాల్ ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం

image

పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును చెల్లించేందుకు ఈ నెల 12 వరకు గడువుందని డీఈఓ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ ఫీజు కింద రూ.వెయ్యి అపరాధ రుసుమును చెల్లించాలని కోరారు. అదే తేదీలోపు అన్ని డాక్యుమెంట్లతో నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్ట జడ్పీ స్కూల్లో గల జిల్లా పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని కోరారు.

News February 6, 2026

నెల్లూరు: తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న

image

తండ్రి స్థానంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ అన్న తన తమ్ముడి భార్య పైనే కన్నేశాడు. ప్రశ్నించిన తమ్ముడిని చితకబాదాడు. చివరకు తల్లి ఫిర్యాదుతో జైలు పాలయ్యాడు. నెల్లూరు రూరల్ సీఐ గుంజి వేణు వివరాల మేరకు.. పెనుబర్తి ఎస్టీ కాలనీలో నివాసముండే శ్రీనివాసులు తన తమ్ముడి భార్యపై మోజులోపడి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో శ్రీనివాసులును గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.

News February 6, 2026

నెల్లూరు జిల్లాలో చమురు నిక్షేపాలు..?

image

మనుబోలు మండలం కుడితిపల్లి పొలాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ గురువారం రీ సర్వే చేసింది. ఆ సంస్థ పీఆర్వో సుధీర్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి శాటిలైట్ ద్వారా వచ్చిన 2డీ ఫొటోల ఆధారంగా ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మైపాడు నుంచి చెన్నూరు వరకు సర్వే చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడత సర్వే పూర్తి చేశామన్నారు.