News January 16, 2025

నెల్లూరు: రూ.21 కోట్ల మద్యం తాగేశారు

image

సంక్రాంతి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లాలో మద్యం ఏరులై పారింది. కేవలం ఐదు రోజుల్లో రూ.21 కోట్ల విలువైన మద్యాన్ని తాగేశారు. ముఖ్యంగా భోగి, కనుమ పండగ రోజుల్లో మద్యం దుకాణాల వద్ద తీవ్రమైన రద్దీ ఏర్పడింది. ఉదయం నుంచి రాత్రి వరకు మద్యం ప్రియులు దుకాణాల వద్ద బారులుతీరి కనిపించారు. ప్రధాన బ్రాండ్ల మద్యం స్టాక్ అయిపోయినా ఏది ఉంటే అదే కొనుగోలు చేశారు.

Similar News

News January 27, 2025

నెల్లూరు పోలీస్ గ్రీవెన్స్‌కు 80 అర్జీలు

image

పోలీసు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా వచ్చిన అర్జీలను విచారించి చట్టపరంగా న్యాయం చేస్తామని SP జి. కృష్ణ కాంత్ తెలిపారు. సోమవారం జిల్లా నలుమూలల నుంచి 80 ఫిర్యాదులు అందాయని, వాటి పరిష్కారానికి ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలో దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆన్‌లైన్ మోసాలు, రోజురోజుకు పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

News January 27, 2025

నెల్లూరులో దారుణ హత్య.. అసలు కారణం ఇదే.!

image

నెల్లూరు నగరంలోని జాకీర్ హుస్సేన్ కాలనీలో 25వ తేదీన మహబూబ్ బాషా అనే వ్యక్తి దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ కేసులో షాహిద్ అనే నిందితుడిని నవాబుపేట పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ అన్వర్ బాషా మాట్లాడుతూ.. మహబూబ్ బాషా కూతురును ఇచ్చి వివాహం చేయకపోవడంతో ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని షాహిద్ మహబూబ్ బాషాను హత్య చేసినట్లు తెలిపారు.  

News January 27, 2025

నెల్లూరు: వాహనం ఢీకొని చిరుత మృతి

image

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం సింగనపల్లి అటవీ ప్రాంతం వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. సోమవారం తెల్లవారుజామున విజయవాడ జాతీయ రహదారిపైకి వచ్చిన చిరుతను గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో గంటపాటు ప్రాణాలతో చిరుత కొట్టుమిట్టాడిందని పలువురు వాపోయారు. చిరుతను కాపాడేందుకు దగ్గరికి వెళ్లేందుకు వాహనదారులు సాహసం చేయలేకపోయారు.