News May 23, 2024
నెల్లూరు: రెండు లారీలు ఢీ.. డ్రైవర్ సజీవ దహనం
కృష్ణపట్నం పోర్ట్ నుంచి పేరేచర్ల వెళుతున్న లారీ.. మేదరమెట్ల పైలాన్ రహదారి పక్కన ఆగి ఉన్న మరో లారీని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ఇనమనమడుగు చెందిన డ్రైవర్ శ్రీధర్ క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయారు. ఈ లోగా మంటలు చెలరేగి అతను సజీవదహనం అయ్యాడు.
Similar News
News January 21, 2025
బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు ఇతనే
బీజేపీ నెల్లూరు జిల్లా అధ్యక్షునిగా సీపాన వంశీధర్ రెడ్డి మళ్లీ ఎన్నికయ్యారు. రాష్ట్ర, కేంద్ర నాయకత్వం వంశీధర్ రెడ్డిని ఎంపిక చేసిందని రాష్ట్ర పరిశీలకులు ప్రకటించారు. ఈ సందర్భంగా తిరిగి వంశీధర్ రెడ్డి ఎన్నిక పట్ల బీజేపీ నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు.
News January 21, 2025
నెల్లూరులో ఇద్దరు సర్పంచ్‌లకు చెక్ పవర్ రద్దు
నెల్లూరు జిల్లాలో నిధుల దుర్వినియోగానికి పాల్పడిన ముగ్గురు పంచాయతీ కార్యదర్శులను, నిబంధనలకు విరుద్ధంగా నిధులు డ్రా చేసిన ఇద్దరు సర్పంచ్‌లపై కలెక్టర్ ఓ ఆనంద్ చర్యలు చేపట్టారు. కొడవలూరు మండలం పెమ్మారెడ్డి పాలెం పంచాయతీ కార్యదర్శి శ్రీకాంత్, గతంలో పనిచేసిన మధుసూదన్, రేగడిచెలిక పంచాయతీ కార్యదర్శి విజయ్ కుమార్‌లను సస్పెండ్ చేశారు. రేగడిచెలిక, పెమ్మారెడ్డి పాలెం సర్పంచ్‌ల చెక్ పవర్ రద్దు చేశారు.
News January 21, 2025
జేఈఈ మెయిన్స్ పరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి: కలెక్టర్
ఈ నెల 22వ తేదీ నుంచి జరిగే JEE మెయిన్స్ పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ ఒ.ఆనంద్ తెలిపారు. కోవూరు మండలం గంగవరంలోని గీతాంజలి ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్& టెక్నాలజీ, పొట్టేపాలెం ఇయాన్ డిజిటల్ జోన్, తిరుపతి జిల్లా కోటలోని NBKR ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీ కళాశాలలలో పరీక్షలు జరుగుతాయన్నారు.