News July 8, 2024

నెల్లూరు: రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి

image

రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదవశాత్తు రైలు ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన వేదాయపాళెం రైల్వే స్టేషన్ సమీపంలో ఆదివారం జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన రైల్వే పోలీసులు మృతుడి వయసు సుమారు 55 ఏళ్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు.

Similar News

News January 9, 2026

నెల్లూరు జైలును తనిఖీ చేసిన హోంమంత్రి అనిత

image

వెంకటాచలం మండలం చెముడుగుంటలోని నెల్లూరు సెంట్రల్ జైలును హోం మంత్రి అనిత శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. జైల్లోని వసతులను పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జైల్లో మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రిమాండ్ ఖైదీగా ఉన్నారు. వైసీపీ నేతలు ఆయనతో ములాఖాత్ అవుతున్న నేపథ్యంలో ఆమె ఆకస్మిక తనిఖీలు ప్రాధాన్యతను సంతరించుకుంది.

News January 9, 2026

త్వరలో సూళ్లూరుపేటకు మహర్దశ.!

image

సూళ్లూరుపేట(M) బీవీపాలెం సమీపంలో దాదాపు 150 ఎకరాల్లో ఫ్లోటింగ్ వాటర్ రిసార్ట్స్, వాటర్ స్పోర్ట్స్, ఎకో-టూరిజంతో పాటు పులికాట్ పరిసర ప్రాంతాల్లో గ్రీన్ టూరిజం అభివృద్ధి చేయనున్నారు. ఈ టూరిజాన్ని PPP మోడల్‌లో పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది. సుమారు రూ.350 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇక టూరిజం ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 500 పైచిలుకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి.

News January 9, 2026

నెల్లూరు: ‘భోగి మంటల్లో అవి వేస్తే ప్రమాదం’

image

టైర్లు, ప్లాస్టిక్ వస్తువులతో భోగి మంటలలో వేయొద్దని దుత్తలూరు PHC వైద్యులు సయ్యద్ ఆయూబ్ అప్సర్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రానున్న సంక్రాంతి పండగల్లో భాగంగా భోగి మంటల్లో టైర్లు, ప్లాస్టిక్ వస్తువులు వేస్తే పర్యావరణం దెబ్బతినడమే కాకుండా కేన్సర్, టీబీ, చర్మ, కంటి జబ్బులు వచ్చే ప్రమాదం ఉందన్నారు. సంప్రదాయబద్ధంగా పండగలను చేసుకోవాలని పిలుపునిచ్చారు.