News September 25, 2024
నెల్లూరు విజయ డెయిరీ ఎన్నికలు ఏకగ్రీవం

నెల్లూరు జిల్లా పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార సమితి లిమిటెడ్ (విజయ డెయిరీ)కి సంబంధించి జరగాల్సిన మూడు డైరెక్టర్ పోస్టుల ఎన్నికలు ఏకగ్రీవం అయినట్లు ఎన్నికల అధికారి హరిబాబు మంగళవారం పేర్కొన్నారు. అన్నం శ్రీహరి (అన్నారెడ్డిపాళెం), కోట చంద్రశేఖర్ రెడ్డి (నారికేళపల్లి), గంగా శ్రీనివాసులు (వాసిలి) ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు తెలిపారు. వారి పదవీకాలం ఈ నెల 30వ తేదీ నుంచి ఐదు సంవత్సరాలు ఉంటుందన్నారు.
Similar News
News November 8, 2025
నెల్లూరులో కీలక సమావేశం.. MLAలు ఏమంటారో?

కనుపూరు, గండిపాలెం, స్వర్ణముఖి బ్యారేజి, రాళ్లపాడుతో పాటు సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువలకు సాగునీటి విడుదల చేయాల్సి ఉంది. ఆయా కాలువల్లో గుర్రపు డెక్క తీయలేదు. పెన్నా పొర్లు కట్టల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చేజర్ల, అనంత సాగరం, ఆత్మకూరులో రూ.18198 కోట్ల పనులకు అనుమతులు రాలేదు. డేగపూడి, బండేపల్లి కెనాల్ భూసేకరణ పెండింగ్ ఉంది. నెల్లూరులో నేడు జరిగే IAB సమావేశంలో MLAలు వీటిపై ఫోకస్ చేయాల్సి ఉంది.
News November 7, 2025
నెల్లూరు: భార్య హత్య కేసులో భర్తకు జీవిత ఖైదు

మనుబోలు పరిధిలోని భార్య హత్య కేసులో ముద్దాయి రాపూరు శ్రీనివాసులు @ చిన్నోడుకు జీవిత ఖైదుతో పాటు రూ.1,000 జరిమానా విధిస్తూ 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి తీర్పు వెలువరించారు. 2018 జులై 2వ తేదీ తమ కుమార్తె ప్రేమ వివాహం విషయమై భార్య రాపూరు వెంకటరమణమ్మతో చిన్నోడికి తగాదా జరిగింది. ఆ కోపంతో నెల్లూరు నుంచి KR పురం వెళ్తుండగా మార్గమధ్యలో ఆటోను ఆపి ఆటో జాకీ రాడ్‌తో భార్యపై దాడి చేసి హత్య చేశాడు.
News November 7, 2025
ఉలవపాడు: రోడ్డు ప్రమాదంలో ఒకరి దుర్మరణం

ఉలవపాడు మండలం చాగల్లు–వీరేపల్లి మధ్య రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని వెనుక నుంచి గాయత్రి మిల్క్ వాహనం ఢీకొట్టింది. ఈ ఘటనలో పాల వాహనం డ్రైవర్ రాకొండి దుర్గా మహేష్ (25) అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడిది మద్దిపాడు మండలం వెల్లంపల్లిగా స్థానికులు గుర్తించారు. ఇంకా వివాహం కాలేదని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఉలవపాడు సీహెచ్‌సీకి తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ అంకమ్మరావు తెలిపారు.


