News February 14, 2025
నెల్లూరు: విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

పదో తరగతి చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నెల్లూ రులో జరిగింది. వివరాల్లోకి వెళితే.. నెల్లూరు ధనలక్ష్మీపురంలోని ఓ పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని తోటి విద్యార్థులు ముందు టీచర్ మందలించడంతో మనస్తాపం చెంది భవనం మీద నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆనంతరం ప్రయివేటు ఆసుపత్రికి తరలించారు.
Similar News
News March 14, 2025
భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాలి : కలెక్టర్

ప్రస్తుతం జరుగుతున్న రీసర్వేలో అటవీ అధికారులు భాగస్వాములై ఆయా భూముల వివాదాల పరిష్కారానికి కృషి చేయాల్సిందిగా కలెక్టర్ ఆనంద్ కోరారు. గురువారం కలెక్టరేట్లోని ఎస్‌ఆర్ శంకరన్ హాల్లో అటవీ, వన్యప్రాణుల రక్షణపై సమీక్షా సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. తొలుత సమావేశ ఉద్దేశాలను జిల్లా అటవీ శాఖాధికారి మహబూబ్ భాషా వివరించారు.
News March 13, 2025
నెల్లూరు: నిరుద్యోగులకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

ఏపీ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎనర్జీ సిస్టం, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ, డిప్లమా విద్యార్హత కలిగిన నిరుద్యోగ యువతకు జర్మనీలో ఉద్యోగ అవకాశాలు కలవని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ జిల్లా మేనేజర్ అబ్దుల్ ఖయ్యూం తెలిపారు. 18 నుంచి 40 ఏళ్ల వయసు కలిగిన నిరుద్యోగులు అర్హులని అన్నారు. మరింత సమాచారం కోసం కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.
News March 13, 2025
ప్రశాంతంగా ముగిసిన ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు

2025 మార్చి ఒకటి నుంచి నెల్లూరు జిల్లాలో 79 కేంద్రాలలో ప్రారంభమైన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ప్రధాన పరీక్షలు గురువారంతో ప్రశాంతంగా ముగిశాయని ఇంటర్మీడియట్ బోర్డు నెల్లూరు జిల్లా ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి డాక్టర్ ఏ శ్రీనివాసులు తెలిపారు. గురువారం నాటి జనరల్ విభాగంలో 27,753 మంది విద్యార్థులకు గాను 792 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని, ఒకేషనల్ విభాగంలో 730 మందికి గాను 104 మంది గైర్హాజరయ్యారన్నారు.