News September 27, 2025

నెల్లూరు: విధులకు రాకున్నా.. పక్కాగా జీతం !

image

గతంలో DMHO గా పనిచేసిన పెంచలయ్య హయాంలో కృష్ణాపురం PHC కి చెందిన ఓ వైద్యాధికారి 2022లో పీజీ కోర్సు చదివేందుకు వెళ్లారు. అప్పట్నుంచి ఆయన విధులకు హాజరువ్వకుండానే దాదాపు రెండేళ్లకు పైగా ప్రతీ నెల జీతం డ్రా చేసినట్లు సమాచారం. గత DMHO పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయి. తాజాగా దీనిపై విచారణ అధికారిని సైతం ప్రభుత్వం నియమిస్తూ జీవోను విడుదల చేయడం గమనర్హం. ఏమి జరుగుతుందో వేచి చూడాలి.

Similar News

News September 27, 2025

విమానాశ్రయానికి భూసేకరణ సమస్య : GM పద్మ

image

దగదర్తి విమానాశ్రయానికి భూసేకరణే ప్రధాన సమస్యగా మారిందని విమానాశ్రయ అభివృద్ధి సంస్థ GM పద్మ అన్నారు. శుక్రవారం ఆ భూములను అదాని పోర్ట్స్ సంస్థ ప్రతినిధులతో కలిసి పరిశీలించారు. రన్ వే నిర్మాణనికి భూ సమస్య నెలకొందన్నారు. విమానాశ్రాయానికి రవాణా రహదారి, రైల్వే మార్గాల గురించి తహశీల్దార్ కృష్ణను అడిగి తెలుసుకున్నారు. ఎయిర్ పోర్ట్ అథారిటీ ప్రతినిధి గౌరవ్ అదాని పాల్గొన్నారు.

News September 27, 2025

సైబర్ నేరగాళ్ల వలకు చిక్కిన కావలి MLA

image

సైబర్ నేరగాళ్ల వలకు కావలి MLA కృష్ణారెడ్డి సైతం చిక్కుకున్నారు. గత నెల 25 తేదీ నుంచి ఈ నెల 16 లోపు ఆయన బ్యాంక్ ఖాతాల నుంచి రూ.23,16,009 నగదును సైబర్ నేరగాళ్లు కాజేశారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన MLA రెండు రోజుల క్రితం కావలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. RTA బకాయిలు చెల్లించాలంటూ ఆగస్ట్ 22న వాట్సప్ నెంబర్‌కి వచ్చిన APK ఫైల్‌ను MLA టచ్ చేయడంతో సైబర్ నేరగాళ్ల వలకు ఆయన చిక్కారు.

News September 27, 2025

నెల్లూరు జిల్లాలో పర్యాటక ప్రదేశాలు ఎన్నో..!

image

నెల్లూరు జిల్లాలో ఎన్నో పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. మైపాడు బీచ్, కోడూరు బీచ్, పాకల బీచ్, కృష్ణపట్నం, రామయ్యపట్నం పోర్టు ఉన్నాయి. అలాగే నెల్లూరులోని రంగనాధస్వామి ఆలయం, జొన్నవాడ కామాక్షి, వేదగిరి లక్ష్మీనరసింహస్వామి, పెంచలకోన లక్ష్మీనరసింహస్వామి ఆలయాలు, కసుమూరు, బారాషహీద్ దర్గాలు ఎంతో ప్రసిద్ధి. సోమశిల, కండలేరు డ్యామ్‌, ఉదయగిరి కోట చూడదగ్గ ప్రదేశాలు. మీ ప్రాంతంలో చూడదగ్గ ప్రదేశాలను కామెంట్ చేయండి.