News April 15, 2024
నెల్లూరు సమీపంలో ముగ్గురు మృతి

నెల్లూరుకు సమీపంలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. శ్రీకాకుళానికి చెందిన రామయ్య(44), తవిటయ్య(60), సిమ్మయ్య(42) నెల్లూరుకు వలస వచ్చారు. ముగ్గురూ కలిసి ఆదివారం బైకుపై పొదలకూరులో పనికి వెళ్లారు. సాయంత్రం తిరిగి వస్తుండగా కొత్తూరు పోలీసు ఫైరింగ్ ఆఫీసు వద్ద వీరి బైక్‌ను బుల్లెట్ వాహనం ఢీకొట్టింది. రామయ్య స్పాట్లోనే చనిపోగా తవిటయ్య, సిమ్మయ్య నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో కన్నుమూశారు.
Similar News
News October 7, 2025
నెల్లూరు: ‘మీకు తెలిస్తే చెప్పండి’

కలిగిరి మండలంలోని వెలగపాడు సచివాలయం ముందు గల బస్ షెల్టర్ నందు ఒక గుర్తు తెలియని వ్యక్తి చనిపోవడంతో స్థానికులు పోలీసులు సమాచారం ఇచ్చారు. మృతి చెందిన వ్యక్తి వయస్సు సుమారు 40- 45 ఏళ్లు ఉండవచ్చని, చనిపోయిన వ్యక్తి వేసుకున్న షర్ట్ కాలర్ మీద “Pavan Men’s Wear” పామూరు అని ఉన్నట్టు ఎస్సై ఉమాశంకర్ తెలిపారు. మృతి చెందిన వ్యక్తి వివరాలు తెలిస్తే కలిగిరి PS 9440700098 నంబర్‌కు సంప్రదించాలన్నారు.
News October 7, 2025
సమాచారం ఉంటే ఫిర్యాదు చేయండి: కలెక్టర్

జిల్లాలో అక్రమ యూరియా, నకిలీ విత్తనాలు ఎరువులు సంబంధించిన సమాచారం ఉంటే ఫిర్యాదు చేయాలని కలెక్టర్ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలు తెలిపారు. జిల్లాలో నకిలీ విత్తనాలు కల్తీ ఎరువులు అక్రమ యూరియా నిల్వలు నివారణకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అంతర్గత తనిఖీ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏమైనా సమాచారం ఉన్న 8331057225 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.
News October 7, 2025
త్వరలో నెల్లూరుకు రానున్న పవన్..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల పవన్ పర్యటనపై పలు వార్తలు వినిపించాయి. అయితే అక్టోబర్‌లో పవన్ పర్యటన దాదాపు ఖరారు అవుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటనకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద అక్టోబర్‌లోనే పవన్ నెల్లూరు రానున్నారని తెలుస్తోంది.