News January 27, 2026

నెల్లూరు: సినిమా బండి.. పాత రోజులు గుర్తుకొస్తున్నాయి.!

image

‘నేడే చూడండి’ అంటూ బుచ్చిరెడ్డిపాలెంలో నేటికి సినిమా బండి ద్వారా ప్రచారం జరుగుతుండడం కాసింత ఆశ్చర్యం కలుగుతుంది కదా!. సాంకేతిక పరిజ్ఞానం పెరిగి టెక్నాలజీ అందుబాటులో ఉన్న ఈ రోజుల్లో కూడా రిక్షా(సినిమా బండి)లో ప్రచారం చేస్తుండడంతో పాత రోజులు గుర్తుచేస్తున్నారని వీక్షకులు అంటున్నారు. మీ ఊరిలో కూడా ఇలానే ఉంటుందా కామెంట్ చెయ్యండి.

Similar News

News February 13, 2026

నెల్లూరు: మహిళలకు ఆ బస్సుల్లోనూ ఫ్రీ

image

శివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా నుంచి పలు ప్రాంతాలకు RTC తరఫున 147 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని ప్రజా రవాణా అధికారి షేక్ షమీం తెలిపారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. 14, 15, 16వ తేదీల్లో శ్రీశైలం, కోటప్పకొండ, సిద్ధేశ్వరం, మైపాడు తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

News February 13, 2026

నెల్లూరుకు మంచి రోజులు వస్తున్నాయి..!

image

నెల్లూరు జిల్లాకు పరిశ్రమలు క్యూ కడుతున్నాయి. రూ.1000 కోట్లతో ప్రీమియం ఎక్స్‌ప్లోజివ్స్ సంస్థ పరిశ్రమ పెట్టనుంది. రాకెట్‌లో వినియోగించే పేలుడు పదార్థాలను ఈ సంస్థ తయారు చేయనుంది. దుత్తలూరు మండలం రాచవారిపల్లి, బ్రహ్మేశ్వరం పరిధిలో వీరికి 500 ఎకరాలు కేటాయించనున్నారు. స్టెయిన్‌లెస్ స్టీల్ ఉత్పత్తి చేసే రెనైసెన్స్ అనే మరో సంస్థ సైతం రూ.4వేల కోట్లు పెట్టడానికి ఆసక్తి చూపుతోంది.

News February 13, 2026

నెల్లూరు జిల్లాలో ఆ సర్పంచ్ తొలగింపు

image

పంచాయతీ నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వెంకటాచలం సర్పంచ్ మందల రాజేశ్వరిపై గతంలోనే సస్పెన్షన్ వేటుపడింది. తాజాగా గురువారం ఆమెను శాశ్వతంగా తొలగిస్తూ నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ఉత్తర్వులు జారీ చేశారు. సర్పంచ్ అధికార దుర్వినియోగంతో తన భర్త వెంకటశేషయ్య అకౌంట్‌లోకి అక్రమంగా నగదు తరలింపు, నిధుల దుర్వినియోగం నేపథ్యంలో చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.