News January 11, 2026

నెల్లూరు సెంట్రల్ జైల్ నుంచి ఖైదీ పరార్

image

నెల్లూరు సెంటర్ జైలులో శిక్ష అనుభవిస్తున్న ఖైదీ పరారయ్యాడు. బాపట్ల జిల్లా భట్టిప్రోలు గ్రామానికి చెందిన షేక్ చిన్న సైదులు 2022 సంవత్సరంలో తన భార్యను హత్య చేసి శిక్షను అనుభవిస్తున్నాడు. రెండు సంవత్సరాలు రాజమండ్రి జైలులో శిక్షణ అనుభవించి నెల్లూరు సెంట్రల్ జైలుకు తరలించారు. ఖైదీ సైదులు సత్ప్రవర్తన కింద ఓపెన్ జైలుకు తరలించారు. వ్యవసాయ పనులు చేస్తూ పరారయ్యాడు.

Similar News

News February 9, 2026

నెల్లూరు: CIపై ఆరోపణలు.. కానిస్టేబుల్ సస్పెండ్

image

తనను ఉదయగిరి సీఐ N.వెంకట్రావు <<19088594>>వేధిస్తున్నారని <<>>సీతారామపురం మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమెకు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆమెను సస్పెండ్ చేశారు. ‘ఉన్నతాధికారి పర్మిషన్ లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించడం రూల్స్‌కు విరుద్ధం. సీఐపై నిరాధార ఆరోపణలు చేశారు. క్రమశిక్షణ చర్యల కింద ఆమెను సస్పెండ్ చేశాం’ అని SP పేర్కొన్నారు.

News February 9, 2026

CM సమీక్షకు నెల్లూరు కలెక్టర్ హాజరు

image

అమరావతి సచివాలయం నుంచి మంత్రులు, అన్ని శాఖల కార్యదర్శులతో సీఎం చంద్రబాబు కీలక సమావేశం నిర్వహించారు. నెల్లూరు కలెక్టరేట్ నుంచి వర్చువల్‌గా కలెక్టర్ హిమాన్షు శుక్లా, ఎస్పీ డా.అజితా వెజండ్ల, వివిధ శాఖల అధికారులు హాజరయ్యారు. GDP వృద్ధిరేటు, RTGS, ప్రాజెక్టుల పురోగతి.. సంక్షేమ కార్యక్రమాల అమలు, స్వర్ణాంధ్ర విజన్‌ 2047, లా అండ్‌ ఆర్డర్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించారు.

News February 8, 2026

నెల్లూరు: శివరాత్రికి భక్తుల సందడి ఎక్కడంటే..?

image

మహాశివరాత్రి వచ్చిందంటే జిల్లాలోని శివభక్తులు పుణ్యక్షేత్రాల వైపు అడుగులు వేస్తారు. ముఖ్యంగా కృష్ణపట్నం సిద్ధేశ్వర స్వామి, సముద్ర తీరాన వెలసిన కాటేపల్లి శివాలయాలకు భక్తులు భారీగా తరలివెళ్తారు. ప్రకృతి ప్రేమికులు వెంకటాచలం అడవిలోని శివాలయంలో ఏకాంతంగా స్వామిని దర్శించుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఇక మైపాడు తీరాన సముద్ర స్నానాలు ఆచరించి శివయ్యను దర్శించుకోవడం ఇక్కడి భక్తుల ఆనవాయితీ.