News November 7, 2024
నెల్లూరు: హత్య కేసులో ముద్దాయికి జీవిత ఖైదు

ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెంలో జరిగిన హత్య కేసులో చేవూరు సుధీర్‌కు జీవిత ఖైదుతో పాటు రూ.1000 జిల్లా కోర్టు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో జిల్లా ఎస్పీ జి కృష్ణ కాంత్ గుడ్ ట్రయల్ మానిటరింగ్ వ్యవస్థను బలోపేతం చేసి ముద్దాయిలకు కఠిన శిక్షలు పడేలా చేసిన సిబ్బందిని అభినందించారు.
Similar News
News November 3, 2025
ఉద్యోగం ఇప్పిస్తానని రూ.45 లక్షల మోసం

డెన్మార్క్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని కొల్లూరు సుధాకర్ అనే వ్యక్తి రూ.45 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ దర్గామిట్టకు చెందిన ఓ బాధితుడు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉద్యోగం ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అవేదన వ్యక్తం చేశారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.
News November 3, 2025
సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే తప్పా: కాకాణి

సోమిరెడ్డి అక్రమ వసూళ్లను ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. వెంకటాచలం మండలానికి చెందిన వైసీపీ నేత గోపాల్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఉండగా అతడిని పరామర్శించారు. అర్ధరాత్రి నిద్రిస్తున్న గోపాల్ దంపతులపై విచక్షణరహితంగా దాడి చేసి, గోపాల్ గొంతు కోశారని కాకాణి ఆరోపించారు. సోమిరెడ్డి అవినీతిని ప్రశ్నించినందుకే టీడీపీ నేతలు దాడి చేశారని ఆయన అన్నారు.
News November 3, 2025
నెల్లూరు జైలుకు జోగి రమేష్ తరలింపు

నకిలీ మద్యం కేసులో అరెస్టు అయిన మాజీ మంత్రి జోగి రమేష్, జోగి రామును నెల్లూరు జైలుకు తరలించనున్నారు. జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రాముకు ఈ నెల 13 వరకు రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ నేపథ్యంలో వారిని నెల్లూరుకు తీసుకురానున్నారు. ఓ పక్క జోగి రమేష్ అరెస్టు అన్యాయమని, అక్రమమని వైసీపీ నేతలు నిరసన చేపడుతున్నారు.


