News May 29, 2024

నెల్లూరు: 1వ తేదీ లోపే ఏజెంట్ల దరఖాస్తులు

image

ఓట్ల లెక్కింపునకు సంబంధించి జూన్ 1వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు ఏజెంట్ల కోసం అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలని నెల్లూరు జిల్లా అధికారులు తెలిపారు. 4న ఉదయం 8 గంటల్లోపు ఏజెంట్ల మార్పునకు అవకాశం ఉందన్నారు. ఒక సారి ఓట్ల లెక్కింపు కేంద్రంలోకి అనుమతించిన తర్వాత ప్రక్రియ పూర్తయిన తర్వాతే బయటకు వెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు.

Similar News

News November 10, 2025

జడ్పీ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మకు మాతృవియోగం

image

నెల్లూరు జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ ఆనం అరుణమ్మ మాతృమూర్తి కోడూరు సరస్వతమ్మ గత రాత్రి మృతి చెందారు. దివంగత కోడూరు అయ్యప్ప రెడ్డి సతీమణి వైసీపీ నెల్లూరు రూరల్ ఇన్‌ఛార్జ్ ఆనం విజయకుమార్ రెడ్డి అత్త గత అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మృతి చెందారు. సోమవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు బాలాజీ నగర్‌లో అంతిమయాత్ర సాగనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

News November 10, 2025

జిల్లా వ్యాప్తంగా హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు

image

SP డా అజిత వేజెండ్ల ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా 77 ప్రత్యేక బృందాలతో హోటల్స్, లాడ్జిల్లో ముమ్మర తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో నగరంలోని సంతపేట పరిధిలోని ఓ లాడ్జ్‌లో ఆకస్మిక తనిఖీ చేయగా, ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొని, వారి వద్ద నుంచి 6 KGల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలు అరికట్టడానికి లాడ్జిలు, హోటల్స్‌ను ఆకస్మిక తనిఖీలు చేపట్టామన్నారు.

News November 9, 2025

కోవూరులో స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి

image

స్లాబ్ కూలి కార్పెంటర్ మృతి చెందిన ఘటన కోవూరులో చోటుచేసుకుంది. కోవూరు గ్రామంలోని లక్ష్మీనగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ ఇంటి స్లాబ్ పనులను కార్పెంటర్ పట్నం ప్రసాద్‌ (48) చేస్తుండగా ప్రమాదవశాత్తు స్లాబ్ కూలి మృతి చెందాడు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పంచనామా నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.