News December 25, 2024
నెల్లూరు: 10వ తరగతి విద్యార్థులకు గమనిక

నెల్లూరు జిల్లాలో 10వ తరగతి విద్యార్థులు తత్కాల్ పథకం కింద ఈనెల 27 నుంచి జనవరి 10వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చని DEO డాక్టర్ బాలాజీ రావు సూచించారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యార్థులు తత్కాల్ కింద రూ.1000 ఫైన్‌తో ఫీజు చెల్లించి పరీక్షలకు హాజరు కావచ్చన్నారు. సకాలంలో ఫీజులు చెల్లించి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని కోరారు.
Similar News
News September 18, 2025
ఒక్కొక్కరికీ రూ.5 లక్షలు ఇస్తాం: మంత్రి ఆనం

సంగం మండలం పెరమన వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన మృతుల కుటుంబాలను ఆదుకుంటామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. రూ.5 లక్షలు చొప్పున పరిహారం ఇవ్వడానికి సీఎం చంద్రబాబు అంగీకారం తెలిపారన్నారు. తక్షణం ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
News September 18, 2025
నెల్లూరు: గుర్తుతెలియని వ్యక్తి మృతి

గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందిన ఘటన నెల్లూరు-వేదాయపాలెం రైల్వే స్టేషన్ మధ్య బుధవారం జరిగింది. విజయవాడ-చెన్నై మార్గంలో రైలు పట్టాలపై డెడ్ బాడీ దొరికింది. డోర్ వద్ద కూర్చొని రైలు నుంచి జారిపడి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి వయస్సు 30 నుంచి 35 ఏళ్లు ఉంటుంది. మెరూన్ రంగు ఆఫ్ టీషర్ట్, బ్లూ రంగు షార్ట్ ధరించాడు. ఎస్సై హరి చందన కేసు నమోదు చేశారు.
News September 18, 2025
NLR: ఒక్క ప్రమాదం.. 4కుటుంబాల్లో విషాదం

సంగం(M) పెరమన ఘోర <<17737459>>ప్రమాదం <<>>పలువురిని రోడ్డున పడేసింది. ఇందుకూరుపేటకు చెందిన భార్యాభర్త శ్రీనివాసులు, లక్ష్మి చనిపోగా వీరి పిల్లలు(9, 6th క్లాస్) అనాథలయ్యారు. శ్రీనివాసులు, రాధ(నెల్లూరు) నిన్న మృతిచెందగా రెండేళ్ల కిందటే వీళ్ల కుమార్తె ఉరేసుకుంది. కుమారుడు శ్యాం అనాథయ్యాడు. శ్రీనివాసులు హోటల్లో పనిచేసే బ్రహ్మయ్య కారు డ్రైవర్‌గా వచ్చి చనిపోగా.. ఇదే ఘటనలో శారమ్మ, బాల వెంగయ్య(వదిన, మరిది) కన్నుమూశారు.