News September 19, 2024
నెల్లూరు: 100 రోజుల పాలనపై మీ కామెంట్ ఏంటి?

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో 10 సీట్లూ గెలిచి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు రేపటితో 100 రోజiల పాలన పూర్తి చేసుకోనుంది. ఇప్పటి వరకు సాధించిన ప్రగతిని రేపటి నుంచి ఈనెల 26 వరకు ఎమ్మెల్యేలు ప్రజలకు వివరించనున్నారు. పింఛన్ పెంపు, అన్న క్యాంటీన్లు, ఫ్రీ ఇసుక వంటి హామీలను అమలు చేశామని కూటమి చెబుతుండగా, పాలన అట్టర్ ఫ్లాప్ అని వైసీపీ విమర్శిస్తోంది. మరి 100 రోజుల కూటమి పాలన, మీ MLA పనితీరుపై మీ కామెంట్..
Similar News
News July 7, 2025
నెల్లూరుకు చేరుకున్న మంత్రి లోకేశ్

నెల్లూరు పర్యటనలో భాగంగా మంత్రి నారా లోకేశ్ ఆదివారం రాత్రి నగరానికి చేరుకున్నారు. ఆయనకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి దంపతులు బొకే అందించి ఆహ్వానం పలికారు. ఈ మేరకు మంత్రి ఇవాళ VR స్కూల్ ప్రారంభోత్సవంతోపాటు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
News July 7, 2025
నెల్లూరులో సోమవారం మంత్రి లోకేశ్ పర్యటన వివరాలు:

☞ ఉ. 9 గంటలకు VR మున్సిపల్ హైస్కూల్‌ను ప్రారంబోత్సవం
☞ 11 గంటలకు సిటీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొంటారు
☞ మ.12 గంటలకు నాయకుల సమన్వయ సమావేశానికి హాజరవుతారు
☞ సాయంత్రం 4 గంటలకు బారాషాహీద్ దర్గాలో జరిగే రొట్టెల పండగ కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు.
News July 6, 2025
మంత్రి లోకేశ్‌కు స్వాగతం పలికిన అబ్దుల్ అజీజ్

జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి లోకేశ్ ఆదివారం రాత్రి రేణిగుంట విమానాశ్రయం చేరుకున్నారు. ఎయిర్ పోర్ట్‌లో ఆయనకు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ స్వాగతం పలికారు. అనంతరం వారు రోడ్డు మార్గానా నెల్లూరుకు పయనమయ్యారు.