News January 25, 2025
నెల్లూరు: 104 అంబులెన్సుల్లో డ్రైవర్ ఉద్యోగాలు
కొండాపురం, లింగసముద్రం మండలాలతో పాటు నెల్లూరు, కావలి బఫర్ 104 అంబులెన్సుల డ్రైవర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డిస్ట్రిక్ట్ మేనేజర్ వెంకటరెడ్డి తెలిపారు. పదో తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు అర్హులని వెల్లడించారు. అర్హత కలిగిన వారు నెల్లూరు జీజీహెచ్ ఆవరణలోని 104 కార్యాలయంలో జనవరి 27, 28 తేదీల్లో సంప్రదించాలని సూచించారు.
Similar News
News January 26, 2025
నెల్లూరు: 3 రంగుల పతాకం ఆకారంలో చిన్నారులు
నెల్లూరు జిల్లా చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.
News January 26, 2025
చేజర్ల: 3 రంగుల పతాకం ఆకారంలో చిన్నారులు
చేజర్లలోని లుంబిని విద్యాలయంలో ఆదివారం జాతీయ జెండా ఆకారంలో పాఠశాల విద్యార్థినీ, విద్యార్థులు కూర్చున్నారు. కాగా ఈ జెండా ఆకారం పలువురిని ఆకట్టుకుంది. దేశ నాయకుల వేషధారణలతో చిన్నారులు అలరించారు. క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. గణతంత్ర దినోత్సవం గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు గొప్పగా వివరించారు.
News January 26, 2025
ఆ ఆడియో నాది కాదు: నెల్లూరు జైలు సూపరింటెండెంట్
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైల్ సూపరింటెండెంట్ శ్రీరామరాజారావుపై సోషల్ మీడియాలో ఆడియో వైరల్‌గా మారిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజారావు స్పందించారు. ఆ ఆడియోలోని వాయిస్ తనది కాదని వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా, ఎలక్ట్రానిక్ ఛానెల్స్‌లో వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. జైల్లో కొంతమంది ఖైదీలు ప్రవర్తన సరిగా లేకపోవడంతో రాజమండ్రికి తరలించామని, వారిలో కొందరు విడుదలై తనపై కక్ష కట్టారన్నారు.