News January 19, 2026
నెల్లూరు: 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్

నెల్లూరు జిల్లాలో 108 వాహనాల్లో పైలెట్ ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటన తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై హెవీ డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వారు జనవరి 21, 22వ తేదీలలో తిరుపతి జిల్లా అలిపిరి రోడ్డులోని DMHO కార్యాలయం నందు హాజరుకావాలని సూచించారు.
Similar News
News January 30, 2026
నెల్లూరు: ఆలస్యంగా నడిచిన రైళ్లు

నెల్లూరు, గూడూరు, కావలి తదితర స్టేషన్లలో శుక్రవారం ఆగాల్సిన రైళ్లు ఆలస్యంగా నడిచాయి. సూపర్ ఫాస్ట్, ఎక్సప్రెస్, పాసింజర్ రైళ్లన్నీ గంట, రెండు గంటలు లేటుగా వచ్చాయి. ప్రకాశం జిల్లా అమ్మనబ్రోలు వద్ద ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఈ పరిస్థితి తలెత్తిందని నెల్లూరు స్టేషన్ మేనేజర్ తెలిపారు. రైళ్లు ఆలస్యం కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు.
News January 30, 2026
నెల్లూరులో దారుణం

దారి చూపి అండగా ఉండాల్సిన కన్న తండ్రి కామాంధుడై కూతురుపై లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన నెల్లూరులో కలకలం రేపింది. నగరానికి చెందిన ఓ దంపతులకు ఆరేళ్ల కుమార్తె ఉంది. ఆమె ఆలనా పాలన చూసుకోవాల్సిన తండ్రి కూతురుపై కన్నేసి కొన్ని రోజులుగా లైంగిక దాడికి పాల్పడుతున్నాడు. గమనించిన తల్లి భర్తపై సంతపేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News January 30, 2026
నెల్లూరు: ఇద్దరికి పదేళ్ల జైలుశిక్ష

సూళ్లూరుపేట మండలం మన్నారుపోలూరు హైవే క్రాస్ రోడ్డు వద్ద 2018 సెప్టెంబర్ 10న పోలీసులు తనిఖీలు చేస్తుండగా 200KGల గంజాయి పట్టుబడింది. తమిళనాడు(ST) సేలం జిల్లా పెదనాయకంపాళేనికి చెందిన మహదేవన్, వెంకటేశ్‌ను అరెస్ట్ చేశారు. నేరం రుజువు కావడంతో 10ఏళ్ల జైలు శిక్ష, రూ.లక్ష చొప్పున ఇద్దరికి జరిమానాను విధిస్తూ నెల్లూరు ఫస్ట్ ఆడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి గీత గురువారం తీర్పు చెప్పారు.


