News March 11, 2025
నెల్లూరు: 12మంది అడ్మిన్లకు షోకాజ్ నోటీసులు జారీ

నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలోని వార్డు సచివాలయ అడ్మిన్ కార్యదర్శులు, ఇన్‌ఛార్జ్ అడ్మిన్ కార్యదర్శులు 12 మందికి రెవెన్యూ వసూళ్లలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్న కారణంతో కమిషనర్ సూర్య తేజ షోకాజ్ నోటీసులను సోమవారం జారీ చేశారు. కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ వారి ఆదేశాల మేరకు ఈ నెల చివరి నాటికి కరెంట్ డిమాండ్ 100%, అరియర్ డిమాండ్ 75% పూర్తి చేయాలని నిర్దేశించారని తెలిపారు.
Similar News
News March 11, 2025
గృహ నిర్మాణాలకు అదనంగా నగదు అందజేత

2019-24 మధ్యకాలంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు గృహాలు మంజూరై ఇంకను వివిధ దశలలో అసంపూర్తిగా నిర్మాణంలో ఉన్న ఇళ్లను పూర్తి చేయడానికి అదనంగా ఆర్థిక సహాయం అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఎస్సీ, బీసీలకు రూ.50 వేలు, ఎస్టీలకు రూ.75 వేలు అందజేస్తామన్నారు.
News March 11, 2025
నెల్లూరు: నేటి నుంచి శనగల కొనుగోలు రిజిస్ట్రేషన్లు

నెల్లూరు జిల్లాలోని శనగ పంటను ప్రభుత్వ మద్దతు ధరకు విక్రయించేందుకు నేటి నుంచి 20వ తేదీ వరకు రైతు సేవా కేంద్రాల్లో రైతులు తమ పేర్లను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని జేసీ కార్తీక్ తెలిపారు. ప్రభుత్వం శనగను రూ.5,650 మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని జిల్లాలోని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News March 11, 2025
నెల్లూరు: సరైన బిల్లులు లేని 4 కేజీల బంగారం స్వాధీనం

వెంకటాచలం టోల్ ప్లాజా వద్ద జిల్లా విజిలెన్స్ ఎస్పీ రాజేంద్రకుమార్ ఆదేశాల మేరకు సీఐ కే.నరసింహారావు, DCTO కే. విష్ణు రావు తమ సిబ్బందితో వాహనాల తనిఖీలు చేపట్టారు. సరైన బిల్లులు లేకుండా కారులో తరలిస్తున్న రూ.3 కోట్ల 37 లక్షల విలువైన 4 కేజీల 189 గ్రాములు బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారం, కారును జీఎస్టీ అధికారులకు అప్పగించారు.