News September 19, 2024

నెల్లూరు: 15 మంది YCP కార్పొరేటర్లు TDPలో చేరిక

image

నెల్లూరు నగరానికి చెందిన 15 మంది YCP కార్పొరేటర్లు, నుడా మాజీ ఛైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, విద్యా శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో TDPలో చేరారు. వీరికి నారా లోకేశ్ పసుపు కండవా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మంత్రి నారాయణ, రూప్ కుమార్ యాదవ్ తదితరులు ఉన్నారు.

Similar News

News November 13, 2025

నెల్లూరు ఆసుపత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి

image

నెల్లూరు ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో 65 ఏళ్ల వృద్ధుడు మృతిచెందాడు. చుట్టు పక్కల వారు గుర్తించి హాస్పిటల్ అధికారులు, పోలీసులకు సమాచారం అందించారు. దర్గామిట్ట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని వివరాలు తెలియకపోవడంతో దర్యాప్తు చేస్తున్నారు. మృతుని ఆచూకీ తెలిసిన వారు 9440700018, 08612328440 నంబర్లకు కాల్ చేయాలని పోలీసులు కోరారు.

News November 13, 2025

వారికి రూ.90 కోట్ల మంజూరు: అబ్దుల్ అజీజ్

image

నెల్లూరు: ఇమామ్, మౌజన్‌ల గౌరవ వేతనాల కోసం రూ.90 కోట్లు మంజూరు చేసినట్లు ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కట్టుబడి ఉందని మరోసారి నిరూపించిందన్నారు. చంద్రబాబు దూరదృష్టి, సమానత్వ నిబద్ధతతోనే ముస్లింల అభివృద్ధి జరుగుతుందన్నారు.

News November 12, 2025

రేపే నెల్లూరుకు ఫుడ్ కమిషన్ సభ్యుడి రాక

image

రాష్ట్ర ఫుడ్ కమిషన్ సభ్యుడు బి.కాంతారావు నెల్లూరు జిల్లాలో ఈనెల 13, 14న పర్యటించనున్నారు. ఈ మేరకు కలెక్టర్‌ హిమాన్షు శుక్లా బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. పీడీఎస్‌ షాప్స్, ఐసీడీఎస్‌, మధ్యాహ్న భోజన పథకం అమలు, అంగన్‌వాడీ కేంద్రాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ పాఠశాలలు, వసతి గృహాలను తనిఖీ చేస్తారు. మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖపై సమీక్ష చేస్తారు.