News January 18, 2025
నెల్లూరు: 17 రోజుల్లో పది మంది మృతి

నెల్లూరు జిల్లాలో గడచిన 17 రోజుల్లో వివిధ కారణాలతో పదిమంది ఆత్మహత్య చేసుకున్నారు. కొంతమంది ప్రేమ విఫలమై, కొంతమంది బెట్టింగ్లకు పాల్పడి, కొంతమంది వ్యక్తిగత సమస్యలతో బలవన్మరణానికి పాల్పడ్డారు. కాగా చిన్న చిన్న సమస్యలకే తనువు చాలించడం సరైంది కాదని మానసిక నిపుణులు పేర్కొంటున్నారు. మానసిక దృఢత్వం అవసరమని వారు అభిప్రాయపడుతున్నారు.
Similar News
News February 21, 2026
నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ నెల్లూరు జిల్లా రిజిస్ట్రార్‌గా రవి జోసెఫ్ నియమితులైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా శుక్రవారం ఆయన తన కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. గత జిల్లా రిజిస్ట్రార్ బాలాంజనేయులు ఆయనకు పుష్పగుచ్ఛం ఇచ్చి అభినందనలు తెలిపారు. ఉద్యోగులు, సిబ్బంది రవి జోసెఫ్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సిబ్బందితో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు.
News February 21, 2026
నెల్లూరులో 20వేల మంది ఎదురుచూపులు..!

నెల్లూరు జిల్లాలో 29లక్షల మంది జనాభాలో 30,5640 మంది పెన్షనర్లు. వీరికి నెలకు రూ.127 కోట్లు పంపిణీ చేస్తున్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత నూతన పెన్షన్లకు దరఖాస్తులు ఆహ్వానించలేదు. కనీసం ఎంత మంది లబ్ధిదారులు ఉన్నారనే లెక్కలూ సేకరించలేదు. వితంతు పెన్షన్లూ పెండింగ్‌లో ఉన్నట్లు సమాచారం. సదరం సర్టిఫికెట్స్ ఉన్నవారితో పాటు అన్ని రకాల కొత్త పెన్షన్ల కోసం జిల్లాలో 20వేల మంది ఎదురు చూస్తున్నారు.