News July 22, 2024
నెల్లూరు: 20 ఏళ్ల తర్వాత అధ్యక్షా.. .

టీడీపీ సీనియర్ నాయకుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సర్వేపల్లి నుంచి మూడో సారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ రోజు నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన 20 ఏళ్ల తర్వాత అధ్యక్షా..అని పలకబోతున్నారు. 1994, 1999 ఎన్నికల్లో గెలిచిన ఆయన తిరిగి 2024 ఎన్నికల్లో విజయం సాధించారు. సర్వేపల్లి నుంచి మూడో సారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నాయకుడు కూడా సోమిరెడ్డే.
Similar News
News February 13, 2026
మన నెల్లూరు కలెక్టర్ లవ్ స్టోరీ తెలుసా..?

మన నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా ముస్సోరీలో శిక్షణలో ఉండగా 2013లో కృతికా(పల్నాడు కలెక్టర్) పరిచయమయ్యారు. ప్రాంతాలు వేరైనా ఇద్దరి అభిరుచులు ఒకటే కావడంతో పరస్పరం ఇష్టపడ్డారు. తమ కెరీర్‌కు ప్రాధాన్యమిస్తూనే ముందుకు సాగారు. తల్లిదండ్రులను ఒప్పించి 2015లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి రియాన్ష్(8), పాప అహిల్యా(18 నెలలు) ఉన్నారు. లవర్స్ డే నేపథ్యంలో తమ ప్రేమ బంధాన్ని ఆయన Way2Newsకు వివరించారు.
News February 13, 2026
కాకాణి కుమార్తెకు నోటీసులు

కోవూరు మండలంలో ఇటీవల మైనర్ బాలిక మృతి దుమారం రేపింది. ఈక్రమంలో ఆమె మృతిపై వైసీపీ నేతలు పలు ఆరోపణలు చేశారు. నిరాధార ఆరోపణలు చేశారని వైసీపీ మహిళా విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేశారు. 16వ తేదీ విచారణకు రావాలని వాట్సాప్ ద్వారా నోటీసులు పంపారు. బాలిక మృతి మీద ఆమె దగ్గర ఉన్న ఆధారాలు తీసుకుని రావాలని కోరారు.
News February 13, 2026
నెల్లూరు: మహిళలకు ఆ బస్సుల్లోనూ ఫ్రీ

శివరాత్రి సందర్భంగా నెల్లూరు జిల్లా నుంచి పలు ప్రాంతాలకు RTC తరఫున 147 స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని ప్రజా రవాణా అధికారి షేక్ షమీం తెలిపారు. ఈ బస్సుల్లోనూ మహిళలకు ఉచిత ప్రయాణం అమలు చేస్తామన్నారు. 14, 15, 16వ తేదీల్లో శ్రీశైలం, కోటప్పకొండ, సిద్ధేశ్వరం, మైపాడు తదితర ప్రాంతాలకు బస్సులు నడుస్తాయని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


