News April 12, 2024
నెల్లూరు: 25 నుంచి లా పరీక్షలు

నెల్లూరు వీఆర్ లా కళాశాల విద్యార్థులకు ఏప్రిల్ 25 నుంచి పరీక్షలు జరగనున్నాయి. మొదటి సెమిస్టరు, 6వ సెమిస్టరు పరీక్షలు నిర్వహిస్తారు. ఫైనల్ ఇయర్ విద్యార్థులకు 6వ సెమిస్టర్ పరీక్షలతో కోర్స్ పూర్తి కానుంది. మే 8న మొదటి సెమిస్టరు విద్యార్థులకు, మే 2న 6వ సెమిస్టరు విద్యార్థులకు పరీక్షలు ముగియనున్నాయి.
Similar News
News October 6, 2025
నెల్లూరు: ఇలా చేస్తే ఆటో డ్రైవర్స్ అందరికీ డబ్బులు

ఆటో డ్రైవర్ల సేవలో పథకం నిధులు చాలా మంది ఆటో డ్రైవర్స్‌కి రాలేదని విమర్శలు వస్తున్నాయి. దీంతో అర్హత ఉండి కూడా నిధులు జమకాని వారికి ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చింది. దగ్గర్లోని సచివాలయంలో ఆటో డ్రైవర్లు ఫిర్యాదు చేస్తే.. వారు ప్రభుత్వం రూపొందించిన యాప్‌లో రిజిస్టర్ చేస్తారు. ఆ ఫిర్యాదు నేరుగా రవాణా శాఖకి వెళ్తుంది. వారి అన్నీ పరిశీలించి అర్హత ఉంటే రూ.15 వేలు ఆటో డ్రైవర్స్ అకౌంట్‌లో జమ చేస్తారు.
News October 6, 2025
నెల్లూరు: బాలికపై లైంగిక దాడి.. పోక్సో కేసు నమోదు

ప్రేమిస్తున్నానని వెంటపడి పదో తరగతి బాలికపై లైంగిక దాడికి పాల్పడిన ఘటనలో శశి అనే యువకుడిపై సంతపేట పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. బాలికను ఓ దుకాణంలో పనిచేసే శశి ప్రేమ పేరుతో వెంటపడేవాడు. బాలికను బైక్‌పై ఎక్కించుకొని తన పిన్ని ఇంటికి తీసుకెళ్లాడు. అక్కడే ఆమెపై బలత్కారం చేశాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో అతడిపై సీఐ రామారావు పోక్సో కేసు నమోదు చేశారు.
News October 6, 2025
నెల్లూరు: లేఅవుట్లు క్రమబద్ధీకరణ 23 దరఖాస్తులు

జిల్లాలో అనాధకార లేఅవుట్లుగా 437 వరకు ఉన్న.. వీటి క్రమబద్ధీకరణకు కేవలం 23 దరఖాస్తులు మాత్రం రావడం గమనర్హం. అధికారులు అక్రమ లేవట్లను క్రమబద్ధీకరించేందుకు పలు విధాలుగా అవకాశాలు కల్పిస్తున్నప్పటికీ సదరు యజమానులు ముందుకు రావడం లేదు. అవసరమైన పత్రాలు, చలానాలు సమర్పించాల్సిన రావడంతో వారికి ఇబ్బందిగా మారుతుంది. మరోవైపు ప్రజా ప్రతినిధులు అండ దండలతో క్రమబద్ధీకరణకు రావడం లేదనేది తెలుస్తోంది.