News February 6, 2026
నెల్లూరు: 39వేల ఎకరాలకు ఒక్కటే కిట్..!

నెల్లూరు జిల్లాలో 39,590 ఎకరాల్లో ఆక్వా సాగు ఉంది. నేలల సాంద్రత, నీటి PH విలువను బట్టి రొయ్యల సాగు చేయాల్సి ఉంటుంది. చెరువు వద్ద నమూనాలు సేకరించి కావలి, నెల్లూరులోని ల్యాబ్లలో రూ.100లకే అధికారులు పరీక్షలు చేయాల్సి ఉంటుంది. ఈనెలలో 840 శాంపిల్స్ సేకరించాల్సి ఉండగా ఆ ఊసే లేదు. రైతులు రూ.వేలు ఖర్చు చేసి ప్రైవేట్ లాబ్స్‌లో టెస్టులు చేయించుకుంటున్నారు. అధికారుల వద్ద ఒకే ఒక మొబైల్ కిట్ ఉండడం కొసమెరుపు.
Similar News
News February 21, 2026
సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.
News February 21, 2026
గౌతమ్.. నిన్ను ఎప్పటికీ మరచిపోలేను: జగన్

నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి గౌతమ్ రెడ్డి వర్ధంతి నేడు. ఈనేపథ్యంలో ఆయనతో తనకు ఉన్న బంధాన్ని మాజీ సీఎం జగన్ గుర్తు చేసుకున్నారు. ‘డియర్ గౌతమ్.. మన స్నేహంతో కూడిన మధురమైన జ్ఞాపకాలను నేను ఎప్పటికీ మరిచిపోలేను. నువ్వు నాకు స్నేహితుడే కాదు సోదరుడివి. నువ్వు ఎప్పటికీ నా హృదయంలో నిలిచిపోతావు’ అంటూ జగన్ భావోద్వేగపూరిత ట్వీట్ చేశారు.
News February 21, 2026
నెల్లూరు: దశాబ్దాల కల’వరం’..!

డక్కిలి(M) ఆల్తూరుపాడు బ్యాలన్సింగ్ రిజర్వాయర్ ప్రాజెక్టు పూర్తయితే వెంకటగిరి, శ్రీకాళహస్తి, తిరుపతి పట్టణాలకు తాగు, సాగు నీటి కొరత నుంచి బయటపడవచ్చు. దశాబ్దాల కల కావడంతో అది తీరితే వారికి వరమే. ఈ ప్రాజెక్ట్ కింద సోమశిల- స్వర్ణముఖి లింక్ కెనాల్‌ను 56 KM మేరా చేపట్టాల్సి ఉండగా రూ. 733.778 కోట్లను పరిపాలన ఆమోదం కోసం పంపారు. అనుమతులు రాకపోవడంతో ప్రాజెక్ట్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.


