News September 2, 2024

నెల్లూరు: 7న మద్యం దుకాణాల బంద్

image

నూతన మద్యం పాలసీ తీసుకురానున్న ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఈనెల 7న రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాల బంద్ నిర్వహించాలని ఏపీ స్టేట్‌బేవరేజస్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అండ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ నిర్ణయించింది. వారు మాట్లాడుతూ.. నూతన మద్యం పాలసీ పేరిట మద్యం దుకాణాలను ప్రైవేట్ పరం దిశగా రాష్ట్రప్రభుత్వం అడుగులు వేస్తోందని అన్నారు. ఇదే జరిగితే తమ పరిస్థితి ఏమిటని ఆందోళన చెందుతున్నారు.

Similar News

News February 21, 2026

ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్: నెల్లూరు SP

image

ఇంటర్ పరీక్షలకు పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు SP అజిత తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందన్నారు. పరీక్షా కేంద్రం సమీపంలో ఉండే జిరాక్స్‌ సెంటర్లను మూసివేస్తున్నట్లు వివరించారు. మాస్ కాపీయింగ్, మాల్ ప్రాక్టీస్ వంటి చర్యలకు విద్యార్థులు ఎవరైనా పాల్పడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నెల 23 నుంచి మార్చి 24 వరకు పరీక్షలు జరగనున్నాయి.

News February 21, 2026

బుచ్చిలో రూ.కోట్లలో క్రికెట్ బెట్టింగ్..?

image

బుచ్చి క్రికెట్ బెట్టింగ్‌కు అడ్డాగా మారింది. నిత్యం కోట్లలో బెట్టింగ్ సాగుతుంది. నిన్న పోలీసులు అరెస్ట్ చేసిన ఇద్దరు వద్ద పట్టుబడ్డ నగదే ఇందుకు సాక్ష్యం. రాదే ఎక్స్‌ఛేంజ్ యాప్ తరహాలో ఎన్నో యాప్‌ల ద్వారా యువతే లక్ష్యంగా నిత్యం బెట్టింగ్ నిర్వహిస్తున్నారు. యువత బెట్టింగుల్లో డబ్బులు పోగొట్టుకొని ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా ఎస్పీ దృష్టి పెడితే ఎందరో బెట్టింగ్ రాయుళ్లు వెలుగులోకి వచ్చే అవకాశం.

News February 21, 2026

సోషల్ మీడియా ద్వారా సమస్యలు చెబుతున్న చిన్నారులు

image

సోషల్ మీడియాతో విద్యార్థులు పెడదారిన పడుతున్న సమయంలో అదే వేదికగా తమ సమస్యలు పాలకుల దృష్టికి తీసుకు వెళ్తున్న సందర్భాలు జరుగుతున్నాయి. ఇటీవల కొండాపురం (M) గజ్జలవారిపల్లి గ్రామానికి విద్యార్థులు రోడ్డు లేదని సోషల్ మీడియా ద్వారా తెలియజేయడంతో పవన్ కళ్యాణ్ స్పందించారు. అదే పందాను అనుసరిస్తూ విద్యార్థులు తమకు రోడ్లు లేవని చేతులెత్తి ముక్కుతూ వీడియో విడుదల చేయడం కొత్త ట్రెండ్‌ను సృష్టిస్తుంది.