News April 5, 2024

నెల్లూరు: CM జగన్ ఏం చెప్పనున్నారు?

image

వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి వీరంతా ఒకప్పుడు CM జగన్‌కు నమ్మిన వ్యక్తులు. వీళ్లంతా TDP గూటికి చేరారు. ఇందులో వేమిరెడ్డి, కోటంరెడ్డి YCP అభ్యర్థులతో ఎన్నికల్లో తలపడనున్నారు. బస్సు యాత్రలో భాగంగా జగన్ నెల్లూరుకు వచ్చారు. ఇవాళ అంతా ఆయన నెల్లూరులోనే ఉంటారు. మరి ఆయా నేతలను ఎదుర్కొనేలా జగన్ ఆ పార్టీ నేతలకు ఎలాంటి దిశానిర్దేశం చేస్తారో చూడాలి మరి.

Similar News

News February 22, 2026

నెల్లూరు: మల్టీప్లెక్స్‌ల్లో “తెరచాటు” దోపిడి!

image

నెల్లూరువాసులకు ఆదివారం వచ్చిందంటే సినిమాలు, బీచ్‌లు, పార్కులకు కుటుంబ సమేతంగా వెళ్తుంటారు. సినిమా ప్రేమికులు అయితే కుటుంబ సమేతంగా మల్టిప్లెక్స్‌లో సినిమాకి వెళ్లాలంటే రూ.2వేలు నుంచి రూ.4వేలు వరకు ఖర్చు అవుతుందని వాపోతున్నారు. టికెట్లు రూ.వెయ్యి లోపు అయినా, తినుబండారాలకు రూ.2వేలకు పైన ఖర్చు అవుతుందని అంటున్నారు. అధికారులు ధరల నియంత్రణపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

News February 22, 2026

నెల్లూరు: ఆ మంత్రి రూటే వేరయా..!

image

జిల్లాలో మంత్రి నారాయణ రూటే సెపరేట్ అంట. ఆయనకు పార్టీ శ్రేణుల సమన్వయంతో పనే లేదంట. కేవలం అతని అనుచరులు, అభివృద్ధి పనులే ముఖ్యమంటూ మందుకెళ్తున్నారట. మరోవైపు మంత్రి హోదాలో ఉండి పార్టీని సమన్వయం చేయడంలో విఫలమయ్యారని ఆ పార్టీ నేతలు చెప్పుకొస్తున్నారు. కాగా.. నెల్లూరులో జరుగుతున్న అభివృద్ధి మంత్రికి ప్లస్ పాయింట్‌గా మారుతుందడం కలిసిచ్చే అవకాశం. అయినా పార్టీలో జోష్ నింపడంపై దృష్టి సారించాలని అంటున్నారు.

News February 22, 2026

కావలి: దైవ దర్శనాకి వెళ్లి ఒకరి మృతి

image

దైవ దర్శనానికి వెళ్తూ ఒకరు మృతి చెందిన ఘటన అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగింది. కావలికి చెందిన పురుషోత్తం(60) ఆత్రేయపురం మండలం వాడపల్లి ఏడువారాల వేంకన్నను దర్శించుకోవాలని రాజమండ్రికి వెళ్లారు. అక్కడ నుంచి ఆటోలో ఆలయానికి బయలుదేరగా RTC బస్సు ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఆటోలోని నలుగురికి గాయాలయ్యాయి. పురుషోత్తం చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆత్రేయపురం SI కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.