News January 6, 2026
నెల్లూరు: MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు

వేరుశనగ, నిమ్మ పంటలకు అనుగుణంగా MSME పార్కుల్లో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకుంటామని నెల్లూరు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. నెల్లూరు జడ్పీలో మంగళవారం సమావేశం జరిగింది. ఎలాంటి గ్యారంటీలు లేకుండా MSMEలకు రుణాలు ఇవ్వడం లేదని చర్చ జరిగింది. MSME రుణాల మంజూరుకు మార్జిన్ మనీ ఇస్తామని.. రుణాలు త్వరగా ఇవ్వాలని ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు కోరారు.
Similar News
News February 6, 2026
తత్కాల్ ఫీజు చెల్లింపునకు 12 వరకు అవకాశం

పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫీజును చెల్లించేందుకు ఈ నెల 12 వరకు గడువుందని డీఈఓ బాలాజీరావు ఒక ప్రకటనలో తెలిపారు. తత్కాల్ ఫీజు కింద రూ.వెయ్యి అపరాధ రుసుమును చెల్లించాలని కోరారు. అదే తేదీలోపు అన్ని డాక్యుమెంట్లతో నామినల్ రోల్స్‌ను ఆన్‌లైన్‌లో సమర్పించాలని సూచించారు. వివరాలకు bse.ap.gov.in లేదా దర్గామిట్ట జడ్పీ స్కూల్లో గల జిల్లా పరీక్షల విభాగాన్ని సంప్రదించాలని కోరారు.
News February 6, 2026
నెల్లూరు: తమ్ముడి భార్యపై కన్నేసిన అన్న

తండ్రి స్థానంలో బాధ్యతగా వ్యవహరించాల్సిన ఓ అన్న తన తమ్ముడి భార్య పైనే కన్నేశాడు. ప్రశ్నించిన తమ్ముడిని చితకబాదాడు. చివరకు తల్లి ఫిర్యాదుతో జైలు పాలయ్యాడు. నెల్లూరు రూరల్ సీఐ గుంజి వేణు వివరాల మేరకు.. పెనుబర్తి ఎస్టీ కాలనీలో నివాసముండే శ్రీనివాసులు తన తమ్ముడి భార్యపై మోజులోపడి అసభ్యకరంగా ప్రవర్తించేవాడు. దీంతో శ్రీనివాసులును గురువారం పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
News February 6, 2026
నెల్లూరు జిల్లాలో చమురు నిక్షేపాలు..?

మనుబోలు మండలం కుడితిపల్లి పొలాల్లో చమురు, గ్యాస్ నిక్షేపాల కోసం ఓఎన్జీసీ గురువారం రీ సర్వే చేసింది. ఆ సంస్థ పీఆర్వో సుధీర్ మాట్లాడుతూ.. ఢిల్లీ నుంచి శాటిలైట్ ద్వారా వచ్చిన 2డీ ఫొటోల ఆధారంగా ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో మైపాడు నుంచి చెన్నూరు వరకు సర్వే చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా మొదటి విడత సర్వే పూర్తి చేశామన్నారు.


