News April 2, 2025
నెల్లూరు : PM కిసాన్ లింక్ పేరిట మోసం

PM కిసాన్ పేరిట వాట్సాప్‌కు వచ్చిన ఓ ఫైల్‌ను ఓపెన్ చేయడంతో బ్యాంకు ఖాతాలోని నగదు మాయమైన ఘటన నెల్లూరులో జరిగింది. బాధితుని కథనం.. గోమతి నగర్‌కు చెందిన ప్రసాద్ రావుకు వాట్సాప్‌లో పీఎం కిసాన్ లింక్ వచ్చింది. అది ఓపెన్ చేశాడు. తర్వాత గత నెల 29న ఫోన్‌పే ఓపెన్ చేసి చూడగా.. మూడు సార్లు రూ. 2,59,970 డ్రా చేసినట్లు చూపించింది. దర్గామిట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్స్పెక్టర్ రోశయ్య దర్యాప్తు చేపట్టారు.
Similar News
News April 3, 2025
కాకాణి నువ్వెక్కడ..?: అజీజ్

మాజీ మంత్రి కాకాణి ఎక్కడ ఉన్నారు..? పోలీసులకు చిక్కకుండా ఎన్ని రోజులని దాక్కుంటారని రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఛైర్మన్ అజీజ్ ప్రశ్నించారు. తప్పులు చేయడం, పరారవడం మీకు(వైసీపీ) అలవాటే కదా అన్నారు. కాకాణి గోవర్ధన్ రెడ్డి చెప్పే మాటలు, చేసే పనులకు ఎప్పుడూ పొంతన ఉండదని విమర్శించారు. పొదలకూరు మండలం తాటిపర్తి పంచాయతీ వరదాపురం రుస్తుం మైన్ వేదికగా కాకాణి గతంలో చేసిన పాపాలే ఇప్పుడు శాపాలై వెంటాడుతున్నాయన్నారు.
News April 3, 2025
ముస్లింలకు ఉచిత విద్య: అబ్దుల్ అజీజ్

నెల్లూరుకు చెందిన టీడీపీ నేత, ఏపీ వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ అబ్దుల్ అజీజ్ శుభవార్త చెప్పారు. ముస్లింలకు ఉచిత విద్య అందించేందుకు త్వరలో నూతన పథకాన్ని ప్రారంభిస్తున్నామని చెప్పారు. పథకం వివరాలు త్వరలోనే వెల్లడిస్తామన్నారు. వక్ఫ్ ఆస్తుల అద్దెల సవరణకు రెంట్ రివ్యూ కమిటీని నియమించామని తెలిపారు. ఈ మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ కార్యాలయంలో సమావేశమై పలు అంశాలకు ఆమోదం తెలిపారు.
News April 2, 2025
ఏపీకి నూతన రైల్వే ప్రాజెక్టులు కేటాయించారా?: వేమిరెడ్డి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో వివరించాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి కోరారు. వేమిరెడ్డి ప్రశ్నలకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్టవ్ సమాధానమిచ్చారు. రైల్వే ప్రాజెక్టుల కేటాయింపు రాష్ట్రాలు, జిల్లాల వారీగా ఉండదన్నారు. రైల్వే జోన్ల వారీగా ఉంటుందన్నారు. పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు.