News April 5, 2025
నెల క్రితం పెళ్లి.. వివాహిత ఆత్మహత్య!

కదిరి మండలం బోయరామన్నగారిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ (18) అనే యువతి శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. యువతి 45 రోజుల క్రితం కూటాగుళ్ల చెందిన చిన్న అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా ఆమె ప్రయుడిని పెళ్లాడింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు మాట్లాడలేదని మనస్తాపం చెంది ఉరేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
ALERT.. వచ్చే 8 రోజులు జాగ్రత్త!

TG: ఈ నెల 11 నుంచి 19 వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు వెల్లడించారు. ADB, కొమురం భీమ్, నిర్మల్, NZB, జగిత్యాల, మంచిర్యాల, కామారెడ్డి, మెదక్, సిద్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్‌కు (10°C కంటే తక్కువ) పడిపోవచ్చని అంచనా వేశారు. దక్షిణ, తూర్పు జిల్లాల్లో మోస్తరు చలి, ఉష్ణోగ్రతలు 14°C-17°C మధ్య ఉండవచ్చని పేర్కొన్నారు.
News November 9, 2025
6,000 మందితో గీతా పారాయణం

విశాఖపట్నంలోని పోర్ట్ ఇన్‌డోర్ స్టేడియంలో ఆదివారం భగవద్గీత పారాయణం నిర్వహించారు. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆధ్వర్యంలో 6,000 మందికి పైగా భక్తులు ఏకస్వరంతో 700 శ్లోకాల భగవద్గీత పారాయణం చేశారు. 3 గంటలకు పైగా సాగిన ఈ మహా పారాయణంలో గీతా శ్లోకాలు ప్రతిధ్వనిస్తూ ఈ కార్యక్రమం సాగింది. ఈ కార్యక్రమాన్ని ఓ ఫౌండేషన్-అవధూత దత్త పీఠం నేతృత్వంలో నిర్వహించారు.
News November 9, 2025
మరిపెడ: ఆటో, బైక్ ఢీ.. ఒకరు మృతి

మరిపెడ మండలం బురహానుపురం శివారులోని జాతీయ రహదారిపై సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. మరిపెడ ఎస్సై వీరభద్రరావు తెలిపిన వివరాలిలా.. సూర్యాపేట జిల్లా ఇటిక్యాలపల్లికి శివరాత్రి చందు(25), ఖమ్మం జిల్లా సిరిపురం వాసి రాము బైక్‌పై బురహానుపురం నుంచి మరిపెడకు వెళ్తుండగా ఆటోను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో చందు దుర్మరణం చెందగా, గాయపడిన రామును ఆస్పత్రికి తరలించారు.


