News April 5, 2025
నెల క్రితం పెళ్లి.. వివాహిత ఆత్మహత్య!

కదిరి మండలం బోయరామన్నగారిపల్లి గ్రామానికి చెందిన చంద్రకళ (18) శుక్రవారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు సీఐ నారాయణరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా యువతి 45 రోజుల క్రితం కూటాగుళ్లకు చెందిన చిన్న అనే యువకుడిని ప్రేమ వివాహం చేసుకుంది. ఈ క్రమంలో తల్లిదండ్రులు మాట్లాడలేదని మనస్తాపం చెంది ఉరేసుకున్నట్లు సీఐ పేర్కొన్నారు.
Similar News
News February 12, 2026
మాజీ సీఎంసంజీవయ్య జన్మదిన వేడుకలను జయప్రదం చేయండి: కలెక్టర్

అనంతపురం జిల్లా కలెక్టరేట్లో ఈ నెల 14న ఏపీ తొలి దళిత మాజీ ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105వ జన్మదిన వేడుకలను నిర్వహించనున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈనెల 14న ఉదయం 10:30 గంటలకు రెవెన్యూ భవన్లో కార్యక్రమం జరుగుతుందన్నారు. ఈ ఉత్సవాలకు జిల్లా అధికారులు, దళిత నాయకులు, ప్రజా ప్రతినిధులు హాజరై కార్యక్రమాన్ని జయప్రదం కలెక్టర్ పిలుపునిచ్చారు.
News February 12, 2026
ATP: ఉత్సవాల నిర్వహణపై అధికారుల సమీక్ష

అనంతపురం జిల్లాలో బ్రహ్మోత్సవాలు, జాతరలు, శివరాత్రి పర్వదినాల సందర్భంగా పక్కా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ఆనంద్, ఎస్పీ జగదీశ్ ఆదేశించారు. ఆలయాలు, మసీదులు, చర్చిల వద్ద బ్యారికేడింగ్, సీసీ కెమెరాలు, తాగునీరు, శానిటేషన్ సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అగ్నిమాపక, అంబులెన్స్ వాహనాలను సిద్ధంగా ఉంచాలన్నారు. సమన్వయంతో పనిచేస్తూ సెక్యూరిటీ ఆడిట్ నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
News February 12, 2026
రెవెన్యూ అర్జీలపై వేగం పెంచాలి: జేసీ

అనంతపురం కలెక్టరేట్‌లో జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో జేసీ విష్ణుచరణ్ రెవెన్యూ సమస్యల పరిష్కారంపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. పెండింగ్ అర్జీలను వెంటనే క్లియర్ చేయాలని, మ్యుటేషన్ దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. మండలాల వారీగా పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ పూర్తి చేయాలన్నారు. పీజీఆర్‌ఎస్, మీ సేవా సేవలను వేగవంతం చేయాలన్నారు. రీసర్వే ఫేజ్-1, 2, 3 గ్రామాల్లో పనులు పూర్తి చేయాలన్నారు.


