News November 13, 2025

నెల రోజుల్లో పనులు పూర్తి చేయాలి: మంత్రి పొంగులేటి

image

మేడారం సమ్మక్క, సారలమ్మల జాతర అభివృద్ధిలో భాగంగా Y జంక్షన్ నుంచి జంపన్న వాగు వరకు చేపట్టిన నాలుగు లైన్ల రోడ్డు, డివైడర్, ప్లాంటేషన్ పనులను నెల రోజుల్లోపు పూర్తి చేయాలని మంత్రి శ్రీనివాసరెడ్డి అధికారులను ఆదేశించారు. బుధవారం మేడారంలో పర్యటించిన మంత్రి, జాతర సమీపిస్తున్నందున పనుల వేగాన్ని పెంచాలన్నారు.

Similar News

News November 13, 2025

VJA: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి స్వల్ప ఊరట

image

వైసీపీ నేత వంశీ బెయిల్ ఆంక్షల్లో ఏసీబీ కోర్టు బుధవారం స్వల్ప మార్పులు చేసింది. సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో నెలలో రెండో శనివారం పటమట పీఎస్‌కు వెళ్లి సంతకం చేయాలని ఆదేశం ఇచింది. గతంలో 2, 4వ శనివారాలు పీఎస్‌లో సంతకం చేయాలని కోర్టు ఆదేశించింది. దీంతో తన బెయిల్ ఆంక్షలు సడలించాలని వంశీ పిటిషన్ దాఖలు చేశారు. విచారించిన న్యాయస్థానం నెలలో రెండో శనివారం వెళ్లి సంతకాలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

News November 13, 2025

భీమవరంలో వైద్య విద్యార్థిని ఆత్మహత్య

image

భీమవరం (M) కొవ్వాడ‌లో యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. ఎస్సై వీర్రాజు తెలిపిన వివరాలు ప్రకారం హైదరాబాద్‌కు చెందిన హేమవర్షిని (22) భీమవరంలో బీడీఎస్ చదువుతుంది. మంగళవారం తల్లిదండ్రులు ఫోన్ చేసినా తీయలేదు. స్నేహితులు కొవ్వాడలో ఇంటికి వెళ్లికి చూడగా ఉరివేసుకున్నట్లు గుర్తించి తండ్రి సింహాచలం, పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.

News November 13, 2025

సూర్యాపేట: కాస్ట్ లీ బైక్ కనిపిస్తే అంతే..

image

కాస్ట్ లీ బైక్‌లను చోరీలు చేస్తున్న చిలుకూరు మండలం కట్టకొమ్ముగూడెంకు చెందిన వేమూరి కృష్ణ, నకిరేకల్ మండలం ఆర్లగడ్డగూడెంకు చెందిన శివకుమార్‌ను SRPT పోలీసులు <<18266258>>అరెస్ట్ చేసి<<>> రిమాండ్‌కు తరలించారు. వేలిముద్రలను తనిఖీ చేయగా కృష్ణపై 150 బైక్ చోరీ కేసులున్నట్లు గుర్తించారు. అతడిని విచారించగా సూర్యాపేట, ఖమ్మం, మిర్యాలగూడ, నల్గొండతో పాటు HYD, ఏపీలోని పలు ప్రాంతాల్లో బైక్ చోరీలు చేసినట్లు ఒప్పుకున్నాడు.