News December 22, 2025

నెల రోజుల్లో భారీగా పెరిగిన చికెన్ ధరలు

image

TG: కోడిగుడ్ల <<18636145>>ధరలతో<<>> పాటు చికెన్ ధరలు కూడా భారీగా పెరిగాయి. కార్తీక మాసం తర్వాత నెల రోజుల వ్యవధిలోనే చికెన్ సెంటర్ల నిర్వాహకులు పలు చోట్ల ఏకంగా రూ.100 పెంచి అమ్మకాలు కొనసాగిస్తున్నారు. నెల కిందటి వరకు రూ.210-220 ఉండగా ఇప్పుడు రూ.300కు చేరింది. న్యూఇయర్ వరకు రూ.330కి చేరవచ్చని నిర్వాహకులు చెబుతున్నారు. ఉష్ణోగ్రతలు పడిపోవడం, ఉత్పత్తి తగ్గడం, దాణా ఖర్చులు పెరగడమే దీనికి కారణమని అంటున్నారు.

Similar News

News February 7, 2026

బాలీవుడ్‌లో 90% పెళ్లిళ్లు ఫేక్: ‘హిట్-3’ నటుడు

image

బాలీవుడ్‌లో 90శాతం పెళ్లిళ్లు ఫేక్ అని ‘హిట్-3’ నటుడు ప్రతీక్ స్మిత పాటిల్ అన్నారు. ‘ప్రజలకు వాస్తవం ఏంటో తెలియదు. ఇండస్ట్రీలోని వారికే నిజాలు తెలుసు. ఏదో ఒక రోజు ఈ అంశాలు కథగా లేదా పుస్తక రూపంలో లేదా సినిమాగా రావచ్చు. ఒకరినొకరు మోసగించుకోవడం, పలువురితో సంబంధం కలిగి ఉండటం ఇక్కడ ఫ్యాషన్‌గా మారింది. పెళ్లి అంటే ఒక జోక్ అయింది’ అని భార్య ప్రియా బెనర్జీతో కలిసి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

News February 7, 2026

ఫిబ్రవరి 07: చరిత్రలో ఈరోజు

image

* 1888: రచయిత వేటూరి ప్రభాకరశాస్త్రి జననం * 1969: సమరయోధుడు ఆమంచర్ల గోపాలరావు మరణం * 1937: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఎలిహు రూట్ మరణం * 1990: కేంద్ర మాజీ మంత్రి మల్లు అనంత రాములు మరణం * 2008: హాస్యనటుడు లక్ష్మీపతి మరణం * 2018: మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమనాయుడు మరణం (ఫొటోలో)

News February 7, 2026

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.