News October 16, 2025

నెవ్వర్ బిఫోర్ టేస్ట్!

image

ఉమ్మడి కర్నూలు జిల్లాకు ప్రత్యేకత తీసుకువచ్చే ఆహారం రాగి సంగటి. పోషక విలువలు, రుచితో కూడిన ఈ వంటకం జిల్లాలో ప్రసిద్ధి పొందింది. రాగి సంగటిని సాధారణంగా నాటు కోడి కూర లేదా పెరుగు, పచ్చడితో ఆస్వాదిస్తారు. ఆరోగ్యానికి సైతం మేలు చేసే ఈ భోజనం ఇప్పుడు నగరాల్లోనూ ప్రాచుర్యం పొందుతోంది. రాగి సంగటికి ఫ్యాన్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే అని చెప్పుకోవచ్చు.
#ప్రపంచ ఆహార దినోత్సవం

Similar News

News October 16, 2025

నిర్మల్: తూపాకి పట్టి సరిగ్గా 40 ఏళ్లు..!

image

సరిగ్గా 40 ఏళ్ల కిందట జనం వీడి వనంలోకి వెళ్లిన మోహన్ రెడ్డి MH CM ఫడ్నవీస్ ఎదుట బుధవారం లొంగిపోయారు. నిర్మల్ జి. సోన్ మం. కూచన్ పెల్లికి చెందిన మోహన్ రెడ్డి 1960లో జన్మించాడు. 1976లో టెన్త్ పూర్తి చేసి ITI కోసం మంచిర్యాలకు వెళ్లాడు. అక్కడ పీపుల్స్ వార్ భావజాలానికి ఆకర్షితుడై 1985లో అజ్ఞాతంలోకి వెళ్లాడు. 2007లో జార్ఖండ్‌లో ఆయుధాల డెన్‌తో పోలీసులకు దొరికి జైలుకు వెళ్లి 2011లో విడుదలయ్యారు.

News October 16, 2025

PDPL: మరో కీలక మావోయిస్టు సరెండర్..?

image

సికాస కార్యదర్శి, మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు బండి ప్రకాష్ అలియాస్ ప్రభాత్ పోలీసుల ఎదుట లొంగిపోయినట్లు సమాచారం. ఆయన లొంగుబాటుకు ప్రధాన కారణం తీవ్రమైన అనారోగ్యం అని తెలుస్తోంది. అయితే ప్రభుత్వంతో జరిపిన శాంతి చర్చల్లో ప్రకాష్ కీలకంగా వ్యవహరించారు. కాగా, ఈయన లొంగుబాటును పోలీసు ఉన్నతాధికారులు అధికారికంగా ధ్రువీకరించాల్సి ఉంది.

News October 16, 2025

రేపు గుంతకల్లుకు సినీ తారలు

image

గుంతకల్లు పట్టణానికి రేపు సినీ తారలు రానున్నారు. పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో ఓ నూతన షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం చేయడానికి సినీ హీరోయిన్స్ ఐశ్వర్య రాజేశ్, రితిక నాయక్ వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ మేరకు ఏర్పాట్లు చేశామని చెప్పారు. రితిక నాయక్ ఇటీవల విడుదలైన మిరాయ్ చిత్రంతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు.