News April 6, 2024
నెహ్రూ మెచ్చిన పర్చూరు నియోజకవర్గ తొలి ఎమ్మెల్యే కొల్లా రామయ్య

పర్చూరు మండల పరిధిలోని నాగుల పాలెంకు చెందిన కొల్లా రామయ్య 19 ఏళ్ల ప్రాయంలో భారత జాతీయ కాంగ్రెస్ తరఫున పోటీ చేసి కమ్యూనిస్టు యోధుడు కొల్లా వెంకయ్యను ఓడించారు. కమ్యూనిస్టు ప్రభావం ఉన్న తరుణంలో అంతటి ఉద్దండుని ఓడించిన కొల్లా రామయ్య దేశ రాజకీయాల్లో సంచలనంగా మారారు. అప్పటి ప్రధానిగా ఉన్న నెహ్రూ కొల్లా రామయ్యను ప్రత్యేకంగా అభినందించారు.
Similar News
News October 24, 2025
ప్రకాశం జిల్లాలోని పత్తి సాగు రైతులకు గుడ్ న్యూస్

జిల్లాలోని పత్తి సాగు రైతులకు JC గోపాలకృష్ణ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మేరకు జేసీ కార్యాలయం బుధవారం ప్రకటన విడుదల చేసింది. మార్కాపురంలోని మార్కెట్ యార్డులో ప్రభుత్వ మద్దతు ధరకు పత్తిని కొనుగోలు చేసేందుకు ఆయన నిర్ణయించారు. నవంబర్ నుంచి పత్తి పంట కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందని, జిల్లాలోని రైతులు ఈ విషయాన్ని గమనించాలని ప్రకటన విడుదలైంది. ఈ క్రాప్ చేయించుకున్న రైతులు మాత్రమే అర్హులుగా తెలిపారు.
News October 23, 2025
ప్రకాశంలో వర్షం ఎఫెక్ట్.. రూ.2 కోట్లు మంజూరు చేసిన సీఎం

ప్రకాశం జిల్లాలో నాలుగు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే జోరుగా కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని రైతాంగం నష్టాన్ని చూడాల్సి వచ్చిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం ప్రకాశం కలెక్టర్ రాజాబాబు, ఇతర జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లాకు రూ.2 కోట్ల చొప్పున అత్యవసర నిధులు మంజూరు చేశారు.
News October 23, 2025
ప్రకాశం జిల్లాలో ఆ స్కూళ్లకు సెలవులు

భారీ వర్షాల నేపథ్యంలో తీర ప్రాంత మండలాలైన టంగుటూరు, కొత్తపట్నం, నాగులుప్పలపాడు మండలాల్లో పాఠశాలలకు, అంగన్వాడీ కేంద్రాలకు నేడు సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ రాజాబాబు గురువారం ప్రకటన విడుదల చేశారు. అలాగే భారీ వర్షాల వలన వర్షపాతం నమోదైన పామూరు, CSపురం మండలాల్లో కూడా పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఆయా మండలాల్లో వాగులు వంకల నీటి ప్రవాహాన్ని బట్టి సెలవు ప్రకటించవచ్చని కలెక్టర్ అధికారులకు సూచించారు.