News April 5, 2025
నేంద్యాల జిల్లాలో నేటి ముఖ్యవార్తలు

☞ మండ్లెం శివారులో రోడ్డు ప్రమాదం.. యువకుడి దుర్మరణం ☞ ఆళ్లగడ్డ ఎస్సై వేధింపులతో ట్రాక్టర్ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.!☞ గోవింద పల్లెలో ఫ్యాక్షన్ పడగ.! ☞ వైసీపీ కన్వీనర్ ప్రతాప రెడ్డికి కాటసాని పరామర్శ ☞ రైలులో ప్రయాణించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్ ☞ బనగానపల్లెలో మంత్రి బీసీ విస్తృత పర్యటన ☞ జిల్లాలో ఘనంగా జగ్జీవన్ రామ్ జయంతి వేడుకలు ☞ శ్రీశైలం ప్రాజెక్టు పరిధిలో రెండు చిరుత పులుల సంచారం
Similar News
News December 29, 2025
NCDCలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

నేషనల్ కో-ఆపరేటివ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్(NCDC) 4యంగ్ ప్రొఫెషనల్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 31వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి CA-ఇంటర్మీడియట్, ICWA-ఇంటర్మీడియట్, ఎంకామ్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 32ఏళ్లు. షార్ట్ లిస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. జీతం రూ.25,000-రూ.40,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.ncdc.in
News December 29, 2025
బాపట్ల: ‘ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి’

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను అధికారులు త్వరితగతిన పరిష్కరించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. సోమవారం బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని పలువురు ప్రజలు వారి సమస్యలను అర్జీలరూపంలో కలెక్టర్‌కు అందజేశారు. ఆ సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు.
News December 29, 2025
న్యూ ఇయర్ వేడుకలపై ఎస్పీ ఆంక్షలు

నూతన సంవత్సర వేడుకల పేరుతో నిబంధనలు అతిక్రమించి శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ కె. నరసింహ హెచ్చరించారు. వేడుకల నిర్వహణపై పలు ఆంక్షలు విధించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం, డీజేలు ఏర్పాటు చేయడం, ర్యాలీలు తీయడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధిస్తున్నట్లు స్పష్టం చేశారు. రహదారులపై కేక్ కటింగ్ చేయడం, అతివేగంగా వాహనాలు నడపడం వంటి పనులకు దూరంగా ఉండాలని సూచించారు.


