News December 27, 2025
నేచురల్ AC కారిడార్‌గా మూసీ!

మూసీ పునరుద్ధరణలో ప్రభుత్వం ఇప్పుడు సింగపూర్ ‘ABC’ (Active, Beautiful, Clean) మంత్రాన్ని జపిస్తోంది. అధికారిక వర్గాల సమాచారం ప్రకారం.. మూసీని కేవలం పర్యాటక ప్రాంతంగానే కాకుండా నగరాన్ని చల్లబరిచే ఒక భారీ ‘నేచురల్ AC’ కారిడార్‌గా తీర్చిదిద్దాలని ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉంది. నదికి ఇరువైపులా అత్యాధునిక ‘వర్టికల్ ఫారెస్ట్స్’ పెంచడం ద్వారా ఉష్ణోగ్రతలను గణనీయంగా తగ్గించేలా మాస్టర్ ప్లాన్ రెడీ చేస్తోంది.
Similar News
News December 27, 2025
18ఏళ్లైనా న్యాయం జరగలేదు: ఆయేషా పేరెంట్స్

AP: తమ కూతురు ఆయేషా <<10606883>>మీరా<<>> హత్య జరిగి నేటికి 18 ఏళ్లు గడిచినా ఇంకా న్యాయం జరగలేదని తల్లిదండ్రులు వాపోతున్నారు. నిందితులను అరెస్ట్ చేయడంలో సీబీఐ, సిట్ విఫలమయ్యాయని మహిళా కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. సీబీఐ విచారణ కూడా సరిగ్గా చేయలేదని ఆరోపించారు. సామాన్యులకు న్యాయం జరగదని చెప్పడానికి ఇదొక ఉదాహరణ అని చెప్పారు. డిసెంబర్ 27ను ఆయేషా మీరా సంస్మరణ దినంగా ప్రకటించాలని వినతిపత్రంలో కోరారు.
News December 27, 2025
51 జూనియర్ రెసిడెంట్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

<
News December 27, 2025
2025 అల్లూరి జిల్లాలో జరిగిన సంచలన సంఘటనలు ఇవే..!

అల్లూరి జిల్లాలో మావోయిస్టులకు షెల్టర్ జోన్‌గా ఉన్న మారేడుమిల్లిలో నవంబర్ 18,19 తేదీల్లో జరిగిన రెండు ఎన్‌కౌంటర్లలో మావోయిస్టు అగ్రనేత హిడ్మాతో పాటు 13మంది మావోలు మృతి చెందారు. ఈ సంఘటన మావోయిస్టులకు పెద్ద ఎదురుదెబ్బగా చెప్పవచ్చు. డిసెంబర్ 12న చింతూరు మండలం ఘాట్ రోడ్డులో టూరిస్ట్ బస్సు బోల్తా కొట్టి 9మంది యాత్రికులు మృతి చెందగా పలువురు తీవ్రంగా గాయపడ్డారు.


