News February 9, 2026
నేటితో క్యాంపెయిన్ బంద్.. హోరెత్తించనున్న హేమాహేమీలు

మున్సిపల్ ఎన్నికల ప్రచారం నేటి సాయంత్రంతో ముగియనుంది. ఉమ్మడి ఖమ్మంలో ప్రధాన పార్టీల అగ్రనేతలు ప్రచారం చేయనున్నారు. కాంగ్రెస్ తరఫున మంత్రులు భట్టి, తుమ్మల, పొంగులేటి రోడ్‌షోల్లో పాల్గొననున్నారు. బీఆర్ఎస్ తరఫున పువ్వాడ, నామా, వద్దిరాజు ఓట్లు అభ్యర్థించనున్నారు. వామపక్ష నేతలు కూడా తమ అభ్యర్థుల కోసం విస్తృతంగా పర్యటించనున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలన్నీ శాయశక్తులా ప్రయత్నిస్తున్నాయి.
Similar News
News February 15, 2026
కొత్తగూడెం కార్పొరేషన్ మేయర్‌గా మూడ్ గణేష్..!

కొత్తగూడెం మేయర్ అభ్యర్థిగా సుజాతనగర్ 20వ డివిజన్ కార్పొరేటర్ మూడ్ గణేష్ పేరును సీపీఐ అధిష్ఠానం ఖరారు చేసింది. కాంగ్రెస్-సీపీఐ పొత్తులో భాగంగా మేయర్ పీఠాన్ని చెరి రెండున్నరేళ్లు పంచుకోవాలని నిర్ణయించారు. ఈ ఒప్పందంలో భాగంగా తొలి విడత అవకాశం సీపీఐకి దక్కింది. వివాదరహితుడు, సౌమ్యుడిగా పేరున్న ఆయన అభ్యర్థిత్వానికే పార్టీ మొగ్గు చూపింది. త్వరలోనే ఆయన అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు.
News February 15, 2026
టమాటాలో కాయ తొలుచు పురుగును ఎలా నివారించాలి?

టమాటాను కాయ తొలుచు పురుగు ఆశించి తొలుత లేత ఆకులు, కొమ్మలను తిని తర్వాత కాయలను తొలిచి నాశనం చేస్తుంది. ఈ పురుగుల నివారణకు పొలంలో అక్కడక్కడ ఎర పంటగా బంతి మొక్కలను నాటాలి. ఎకరాకు 4 లింగాకర్షక బుట్టలను పెట్టాలి. నాటిన 28, 35 రోజులకు లీటరు నీటికి ఫ్లూబెండమైడ్ 0.3ml కలిపి పిచికారీ చేయాలి. పురుగు ఉద్ధృతి ఎక్కువైతే లీటరు నీటికి క్లోరాంట్రనిలిప్రోల్ 0.3ML లేదా స్పైనోసాడ్ 0.4ML కలిపి పిచికారీ చేయాలి.
News February 15, 2026
అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలో 27 పోస్టులకు నోటిఫికేషన్

అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ 27 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు మార్చి 4వరకు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీని మార్చి 19వరకు పంపాలి. పోస్టును బట్టి PG, PG(ఫిజికల్ ఎడ్యుకేషన్) MLSc, PhD, NET/SET/SLET, CA/CS/ICWA, BEd , MEd, మెడికల్ పీజీ అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. సైట్: https://careers.amuonline.ac.in/


