News September 19, 2025
నేటితో జిల్లాలో 29065 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా: DAO

ఇప్పటి వరకు జిల్లాలో 29065 మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా అయినట్లు DAO విజయనిర్మల తెలిపారు. బయ్యారం, గార్ల, డోర్నకల్ మండలాల్లో యూరియా సరఫరా జరుగుతున్న సరళిని క్షేత్రస్థాయిలో స్వయంగా పరిశీలించారు. ప్రతి నిత్యం పరిస్థితిని గమనిస్తూ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటూ, జిల్లాకి అదనపు యూరియా కోట కోసం కలెక్టర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం జరుగుతుందన్నారు.
Similar News
News September 19, 2025
భూపాలపల్లిలో రేపు మినీ జాబ్ మేళా

భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని బస్టాండ్ పక్కన గల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి శ్యామల తెలిపారు. ఏయూ స్మాల్ ఫైనాన్స్ ప్రైవేట్ బ్యాంకులో 30 ఉద్యోగాలకు ఉ.11 గం.కు జాబ్ మేళా నిర్వహిస్తారన్నారు. ఆసక్తి గల నిరుద్యోగ యువత సంబంధిత అర్హత సర్టిఫికెట్లతో హాజరై అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News September 19, 2025
వాడపల్లి వచ్చే భక్తులు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు

కోనసీమ తిరుమల వాడపల్లి వేంకటేశ్వర స్వామివారి ఆలయంలో రేపు శనివారం సందర్భంగా భక్తుల తాకిడి అధికంగా ఉంటుందనే ముందస్తు అంచనాలతో దేవస్థానం భక్తుల సౌకర్యార్థం పలు ఏర్పాట్లు చేసింది. క్యూ లైన్‌లు, మెడికల్ క్యాంపుల ఏర్పాటు, తాగునీటి సౌకర్యం, మాడవీధుల్లో ఫ్యాన్లు, పార్కింగ్, టాయిలెట్లు సౌకర్యం తదితర సౌకర్యాల కల్పనను శుక్రవారం డిప్యూటీ కమిషనర్ నల్లం సూర్య చక్రధరరావు పర్యవేక్షించారు.
News September 19, 2025
సంగారెడ్డి: మెరిట్ జాబితా విడుదల: డీఈవో

కేజీబీవీలో తాత్కాలిక పద్ధతిగా పనిచేసేందుకు ఏఎన్ఎం అకౌంటెంట్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు శుక్రవారం తెలిపారు. జాబితా www.sangareddy.telangana.gov.inలో వచ్చినట్లు చెప్పారు. జాబితాపై ఏమైనా అభ్యంతరాలు ఉంటే 22లోపు ఆధారాలతో సమగ్ర శిక్ష కార్యాలయంలో సమర్పించాలని పేర్కొన్నారు.