News July 13, 2024
నేటితో పాలిసెట్ రెండో విడత కౌన్సెలింగ్ ముగింపు

పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలకు జరుగుతున్న రెండో విడత కౌన్సెలింగ్లో భాగంగా శ్రీకాకుళం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ధ్రువీకరణ పత్రాల పరిశీలన కొనసాగుతోంది. కాగా శుక్రవారం 40 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం రెండు రోజుల్లో 70 మంది హాజరయ్యారు. ఈ కౌన్సెలింగ్ గురువారం ప్రారంభం కాగా శనివారంతో ముగియనుంది. మొదటి విడత సీట్లు లభించిన విద్యార్థులు బ్రాంచ్లు మార్చుకునే వెసులుబాటు ఉంది.
Similar News
News November 12, 2025
శ్రీకాకుళం: 13 నుంచి పదవ తరగతి ఫీజు చెల్లింపునకు అవకాశం

పదవ తరగతి పబ్లిక్ ఎగ్జామినేషన్ ఫీజును ఈనెల 13 నుంచి 25 వరకు చెల్లించవచ్చని జిల్లా విద్యాశాఖ అధికారి ఎ.రవిబాబు చెప్పారు. జిల్లాలోని 450 ప్రభుత్వ, 196 ప్రైవేట్ పాఠశాలల్లో 22,890 మంది విద్యార్థులు పదవ తరగతి చదువుతున్నారని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు సమాచారం అందించాలని చెప్పారు. గడువు దాటితే అపరాధ రుసుంతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందన్నారు.
News November 12, 2025
హిరమండలం: పెన్షన్ మంజూరు చేయాలని వేడుకోలు

హిరమండలంలోని భగీరధపురం గ్రామానికి చెందిన హరిపురం ఆదిలక్ష్మి (32) పుట్టుకతో వికలాంగురాలు. ఈమెకు బయోమెట్రిక్ పడకపోవడంతో తండ్రిని నామినీగా ఉంచి పింఛన్ అందిస్తూ వచ్చారు. రెండేళ్ల క్రిందట తండ్రి మరణించడంతో పింఛనుకు అంతరాయం ఏర్పడింది. దీంతో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆమె వాపోయింది. సాంకేతిక కారణాలను తొలగించి పింఛను అందించి ఆదుకోవాలని ఆమె వేడుకుంటోంది.
News November 12, 2025
SKLM: నవంబర్ 13న జాతీయ లోక్ అదాలత్

ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఛైర్మన్ జునైద్ అహమ్మద్ మౌలానా పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కోర్టులో ఉన్న న్యాయ సేవ అధికారి సంస్థ కార్యాలయంలో మంగళవారం ఇన్సూరెన్స్ కంపెనీలు, న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. ఎక్కువ కేసులు రాజీ చేసేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. కక్షిదారులకు త్వరితగతిన న్యాయం జరిగేందుకు కృషి చేయాలన్నారు.


