News November 18, 2024
నేటితో మన జాతీయ జంతువు 52 వసంతాల పూర్తి
నల్లమలకే వన్నె తెచ్చిన పెద్దపులిని భారత జాతీయ జంతువుగా గుర్తించి 52 ఏళ్లు పూర్తయింది. ప్రపంచవ్యాప్తంగా పెద్దపులికి ప్రాముఖ్యత ఉండడంతో పలు దేశాలు పెద్దపులిని తమ దేశ జాతీయ జంతువుగా ప్రకటించుకున్నాయి. ఈ నేపథ్యంలోనే 1972 ఈనెల 18న సైబీరియన్ జాతిలోని ఫాన్తేరా టైగ్రిస్ కుటుంబానికి చెందిన పెద్దపులిని జాతీయ జంతువుగా స్వీకరించడం జరిగింది. నేటితో మన జాతీయ జంతువుకు 52 వసంతాలు పూర్తయ్యాయి.
Similar News
News November 18, 2024
‘మెగా డీఎస్సీని వెంటనే విడుదల చేయాలి’
మెగా డీఎస్సీ-2024 నోటిఫికేషన్‌ను వెంటనే విడుదల చేయాలని కర్నూలు డీసీసీ మాజీ ప్రధాన కార్యదర్శి సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు. సోమవారం కర్నూలు కలెక్టరేట్లో మీడియాతో ఆయన మాట్లాడారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చి అధికారంలో వచ్చాక జాప్యం చేయడం సరికాదన్నారు. వెంటనే నోటిఫికేషన్ విడుదల చేయాలని, లేనిపక్షంలో కూటమి ప్రభుత్వం మూల్యం చెల్లించక తప్పదని అన్నారు.
News November 18, 2024
కర్నూలులో సందడి చేసిన హాస్యనటుడు బ్రహ్మానందం
కర్నూలులో సోమవారం హాస్య నటుడు డాక్టర్ బ్రహ్మానందం సందడి చేశారు. మాజీ ఎంపీ టీజీ వెంకటేశ్‌తో కలిసి ఆయన ఓ టీ ప్రొడక్ట్ ఫ్రాంచైజీని ప్రారంభించారు. కర్నూలు ప్రజలు మంచివారని, మంచి సినిమాలను ఆదరించి విజయాన్ని అందిస్తారని బ్రహ్మానందం అన్నారు. ఆయనను చూడ్డానికి అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. అనంతరం టీజీ వెంకటేశ్ నివాసానికి వెళ్లారు.
News November 18, 2024
హిజ్రాల ఆగడాలకు బెంబేలెత్తుతున్న ప్రయాణికులు
మహానంది పుణ్యక్షేత్రానికి వచ్చే ప్రయాణికుల నుంచి హిజ్రాలు ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తుండటంతో బెంబేలెత్తుతున్నారు. కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని క్షేత్రానికి తరలివస్తున్న భక్తుల వాహనాలను ఆపి, 4 చక్రాల వాహనదారుల నుంచి రూ.500, బైకు చోదకుల నుంచి రూ.100 డిమాండ్ చేస్తున్నారు. ఇవ్వకపోతే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని భక్తులు వాపోతున్నారు.