News March 31, 2025
నేటితో ముగియనున్న కొమ్మాల జాతర

వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందిన కొమ్మాల శ్రీ లక్ష్మీనరసింహస్వామి జాతర హోలితో ప్రారంభమై ఉగాది పండగ సందర్భంగా నేడు కొత్త సాలుతో ముగుస్తుందని ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతరకు ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారని చెప్పారు. గతేడాదితో పోల్చితే ఈ సంవత్సరం హుండీ ఆదాయం ఎక్కువగా వచ్చిందని పేర్కొన్నారు.
Similar News
News April 3, 2025
గంభీరావుపేట: ప్రమాదవశాత్తు బావిలో పడి వ్యక్తి మృతి

గంభీరావుపేట మండలం ముస్తఫానగర్‌లో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు బుధవారం బావిలో పడి మృతి చెందాడు. స్థానికుల వివరాల ప్రకారం.. శివంది దేవయ్య(47) తన వ్యవసాయ పొలం వద్ద బావిని పూడిక తీసేందుకు పనులు చేపట్టాడు. పనులు ఎక్కడ వరకు వచ్చాయి అనే క్రమంలో తొంగి చూసే ప్రయత్నం చేయగా అందులో కాలు జారిపడి బావిలో పడడంతోతీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు దేవయ్యను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందతూ రాత్రి మృతిచెందాడు.
News April 3, 2025
చిత్తూరు: నేటి నుంచి స్పాట్ వాల్యుయేషన్

చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీసీఆర్ ప్రభుత్వ పాఠశాలలో గురువారం నుంచి టెన్త్ మూల్యాంకనం జరగనున్నట్లు డీఈవో వరలక్ష్మి తెలిపారు. 10వ తేదీ వరకు స్పాట్ వాల్యుయేషన్ కొనసాగుతుంది. 1,244 మంది టీచర్లకు ఈ బాధ్యత అప్పగించారు. ప్రతి టీచర్ తప్పనిసరిగా మూల్యాంకన విధులకు హాజరు కావాలన్నారు. పేపర్లు కరెక్షన్ చేసే సమయంలో సెల్‌ఫోన్ వాడరాదని స్పష్టం చేశారు.
News April 3, 2025
జనగామ: దరఖాస్తుల ఆహ్వానం

మహాత్మ జ్యోతిబాఫూలే విదేశీ విద్యా నిధి (బీసీ ఓవర్సీస్) పథకం కింద జిల్లాలోని బీసీ, ఈ బీసీ విద్యార్థులు విదేశాలలో చదువుకై దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి రవీందర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 30వ తేదీ వరకు అప్లై చేసుకోవాలన్నారు. వివరాలకు www.telanganaepass.cgg.gov వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.