News February 20, 2025

నేటితో ముగియనున్న లింగమంతుల స్వామి జాతర

image

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర ఇవాళ్టితో ముగియనుంది. నాలుగు రోజుల పాటు లక్షలాది భక్తుల పూజలు అందుకున్న లింగమంతుల స్వామి జాతర మకర తోరణం తీసుకువెళ్లడంతో ముగుస్తుందని యాదవ పూజారులు తెలిపారు. అదేవిధంగా చౌడమ్మ, లింగమంతుల విగ్రహాలు ఉన్న దేవరపెట్టెను తీసుకొని మెంతబోయిన, గొర్ల వంశీయులు సూర్యాపేట మండలం కేసారం బాట పట్టారు.

Similar News

News December 15, 2025

సాఫ్ట్‌బాల్ టైటిల్ ఉమ్మడి పశ్చిమ గోదావరికే

image

వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హైస్కూల్‌లో మూడు రోజులుగా జరిగిన 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ సాఫ్ట్‌బాల్ అండర్-17 పోటీలు ఆదివారం ముగిశాయి. బాలుర విభాగంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా విజేతగా నిలవగా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలు వరుసగా ద్వితీయ, తృతీయ స్థానాలు దక్కించుకున్నాయి. డీఈఓ నారాయణ, జెడ్పీటీసీ జయప్రకాష్ విజేతలకు బహుమతులు అందించారు.

News December 15, 2025

అనంతపురం జిల్లా TDP నేత మృతి

image

అనంతపురం జిల్లా టీడీపీ లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి, రాయదుర్గం బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు జి.లోకానంద సోమవారం తెల్లవారుజామున కన్నుమూశారు. కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. రాయదుర్గం పట్టణానికి చెందిన లోకానంద లీగల్ సెల్‌లో క్రియాశీలక పాత్ర పోషించారు. ఆయన మృతిపై టీడీపీ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.

News December 15, 2025

‘AGRATE’ ఏం చేస్తుంది?

image

‘AGRATE’ చిన్న రైతులకు నాణ్యమైన విత్తనాలు, డ్రిప్ ఇరిగేషన్, ఆధునిక వ్యవసాయ పరికరాలు, సేంద్రియ ఎరువులను తక్కువ ధరకే అందిస్తోంది. అలాగే కొమ్మలను అంటుకట్టడం, ఎక్కువ పంటల సాగు, స్థిరమైన వ్యవసాయ విధానాలపై రైతులకు ఆధునిక శిక్షణ ఇవ్వడంతో పంట దిగుబడి పెరిగింది. ITC, Godrej, Parle వంటి కంపెనీలతో శుక్లా ఒప్పందం చేసుకోవడంతో రైతుల ఉత్పత్తులకు మార్కెట్ అవకాశాలు పెరిగి వారి ఆదాయం గణనీయంగా పెరిగింది.