News April 10, 2024
నేటితో ముగియనున్న NEET(UG) రిజిస్ట్రేషన్ గడువు

దేశవ్యాప్తంగా MBBS, BDSకోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET-2024) రిజిస్ట్రేషన్ గడువు నేటితో ముగియనుంది. రాత్రి 11:50 గంటలలోపు విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడంతో పాటు ఆన్‌లైన్ ఫీజు చెల్లించవచ్చని NTA పేర్కొంది. గత నెల 16న రిజిస్ట్రేషన్ గడువు ముగియగా, తాజాగా మరోసారి రిజిస్ట్రేషన్ విండోను ఓపెన్ చేసింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇదే చివరి అవకాశం అని తెలిపింది.
Similar News
News February 19, 2026
ECIL 200 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్

HYDలోని <
News February 19, 2026
స్టాక్ మార్కెట్లు క్రాష్.. ₹7.5లక్షల కోట్లు ఆవిరి!

దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ముగిశాయి. సెన్సెక్స్ 1236 పాయింట్ల నష్టంతో 82,498కు చేరగా నిఫ్టీ 365 పాయింట్లు కోల్పోయి 25,454కు క్షీణించింది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ఉన్న అన్నీ షేర్లూ నష్టాలతోనే ముగిశాయి. బ్యాంకింగ్, మెటల్, ఆటో, FMCG స్టాక్స్‌లో భారీగా ప్రాఫిట్ బుకింగ్ నమోదైంది. ₹7.5లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైంది. అమెరికా-ఇరాన్ టెన్షన్స్, చమురు ధరలు కూడా నష్టాలకు కారణమయ్యాయి.
News February 19, 2026
పిల్లలకు మసాజ్ చేస్తున్నారా?

నెలల వయసున్న పిల్లలకి మసాజ్ చేయడం మనం చూస్తూనే ఉంటాం. దీని వల్ల వారికి ఎన్నో లాభాలు ఉన్నాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా మసాజ్ వల్ల పిల్లల్లో రక్తప్రసరణ బాగా జరుగుతుంది. బాడీ ఫ్లెక్సిబిలిటీ, జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగవుతుంది. గ్రోత్ హార్మోన్‌ను పెంచుతుంది. బోన్ మినరల్ డెన్సిటీ పెరుగుతుందని చెబుతున్నారు. ముఖ్యంగా ప్రీమెచ్యూర్ బేబీస్‌కి మసాజ్ ఎంతో ఉపకరిస్తుందని సూచిస్తున్నారు.


