News October 18, 2025

నేటి కేయూ పరిధిలో పరీక్షలు వాయిదా

image

రాష్ట్రంలో బీసీ సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో శనివారం కాకతీయ యూనివర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన వివిధ పరీక్షలను వాయిదా వేసినట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి ఆచార్య రాజేందర్ పేర్కొన్నారు. వర్సిటీ పరిధిలో నిర్వహించాల్సిన ఎల్ఎల్‌బీ, బీటెక్, ఎంఎస్సీ ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ కెమిస్ట్రీ, బయోటెక్నాలజీ, ఎంటెక్, దూర విద్య ఎంఎస్ఐఎస్సీ పరీక్షలను వాయిదా వేసినట్లు ఆయన తెలిపారు.

Similar News

News October 18, 2025

ఘోర ప్రమాదం… 8 మంది భక్తుల మృతి

image

మహారాష్ట్రలోని చాంద్‌షాలి ఘాట్ వద్ద పికప్ వ్యాను లోయలో పడి 8మంది భక్తులు మరణించారు. ఇష్టదైవం అస్తంబా దేవీయాత్ర ముగించుకొని తిరిగి వస్తున్న భక్తుల వ్యాను ఘాట్ రోడ్డు మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకుపోయింది. వ్యాను తునాతునకలు కాగా భక్తులు వాహనం కింద పడిపోయారు. 8మంది అక్కడికక్కడే మరణించగా మరో 8మందికి తీవ్ర గాయాలయ్యాయి. అత్యంత వేగంతో వెళ్తూ డ్రైవర్ పట్టుకోల్పోవడమే దీనికి కారణంగా పేర్కొంటున్నారు.

News October 18, 2025

దీపావళిని సురక్షితంగా జరుపుకోవాలి: కలెక్టర్

image

ఈ నెల 20న ప్రజలందరూ జరుపుకోబోయే దీపావళి పండుగను ఏ విధమైన ప్రమాదాలకు తావు లేకుండా జరుపుకోవాలని అంబేడ్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేశ్ కుమార్ సూచించారు. శనివారం అమలాపురంలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఆయన మాట్లాడారు. అనుమతులు లేదా లైసెన్సులు లేని బాణాసంచా దుకాణాల వద్ద కొనుగోలు చేయవద్దని సూచించారు. బాణసంచా సామాగ్రిని సురక్షితమైన ప్రదేశాలలో ఉంచాలన్నారు.

News October 18, 2025

కడప: సీఎంకు ఆహ్వానం

image

కడప అమీన్ పీర్ దర్గా ఉర్సు మహోత్సవాలకు రావాలని సీఎం చంద్రబాబును దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేని ఆహ్వానం పలికారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉర్సు మహోత్సవాలు వచ్చే నెల 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని, ఈ ఉత్సవాలకు తప్పనిసరిగా హజరుకావాలని ముఖ్యమంత్రిని కోరారు.