News April 14, 2025
నేటి నుంచి అల్లాదుర్గం బేతాళస్వామి జాతర

అల్లాదుర్గం బేతాళ స్వామి జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. జాతరకు చుట్టు పక్కల ప్రాంతాల నుండే కాకుండా కర్ణాటక, మహారాష్ట్రతో పాటు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటారు. రాష్ట్రంలోనే ఎక్కడాలేని విధంగా బేతాళస్వామి దేవాలయాన్ని అల్లాదుర్గంలో 4 వందల ఏళ్ల క్రితమే నిర్మించినట్లు సమాచారం.
Similar News
News December 20, 2025
మెదక్: నాడు తండ్రి.. నేడు కొడుకు సర్పంచ్

మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి గ్రామంలో నాడు తండ్రి సర్పంచ్ కాగా.. నేడు తనయుడు సర్పంచ్‌గా ఎన్నికయ్యాడు. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలలో ముప్పిరెడ్డిపల్లి సర్పంచ్‌గా కందాల రాజ నర్సింహా విజయం సాధించగా ఆయన తండ్రి కందాల సాయిలు గతంలో ముప్పిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌గా గెలిచారు.
News December 19, 2025
మెదక్: ‘అప్రమత్తతో ప్రాణ నష్ట నివారణ’

ముందస్తు అప్రమత్తతతో విపత్తుల సమయంలో ప్రాణత్యాగాలు నివారించవచ్చని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు పేర్కొన్నారు. పకృతి విపత్తుల నిర్వహణకు సంబంధించి మాక్ ఎక్సర్సైజ్ నిర్వాహణపై కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. 22న నిర్వహించే మాక్ ఎక్సర్సైజ్ విజయవంతం చేయాలని సూచించారు.
News December 19, 2025
మెదక్: వెబ్ సైట్‌లో మెరిట్ లిస్ట్ వివరాలు: డీఈఓ

మెదక్ జిల్లాలోని కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాలలో ఖాళీలు గల అకౌంటెట్, ANM ఉద్యోగాల భర్తీ కోసం మహిళ అభ్యర్థుల నుంచి దరఖాస్తుల మెరిట్ లిస్ట్ వివరాలను జిల్లా విద్యాశాఖాధికారి వెబ్ సైట్ (https://medakdeo.com/)లో ఉంచినట్లు డీఈఓ విజయ తెలిపారు. దరఖాస్తులు స్వీకరించిన అనంతరం ఆన్లైన్ ఉంచినట్లు పేర్కొన్నారు.


