News December 29, 2025
నేటి నుంచి అసెంబ్లీ.. ‘జల’ జగడమేనా?

TG: నేటి నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు మొదలుకానున్నాయి. <<18695816>>KCR<<>> రాకపైనే సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇటీవల ప్రెస్‌మీట్‌లో ప్రభుత్వంపై సాగునీటి విషయంలో ఉద్యమిస్తామని ప్రకటించిన ఆయన సభలో ఉంటే చర్చ హీట్ ఎక్కనుంది. కాగా ఇవాళ సభలో మొదట డిప్యూటీ స్పీకర్‌ను ఎన్నుకోనున్నారు. తెలంగాణ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, మున్సిపాలిటీస్ చట్ట సవరణ బిల్లు, GHMC చట్ట సవరణ బిల్లులను సీఎం సభలో ప్రవేశపెట్టనున్నారు.
Similar News
News February 12, 2026
ఆయిల్ కొనబోమని ఇండియా చెప్పలేదే: రష్యా

తమ నుంచి ఇండియా ఆయిల్ కొనుగోలు చేయదని ట్రంప్ తప్ప ఇంకెవరూ చెప్పలేదని రష్యా విదేశాంగ శాఖ మంత్రి సెర్గీ లావ్‌రోవ్ అన్నారు. ‘ఇలాంటి స్టేట్‌మెంట్ ట్రంప్ ఇవ్వడం తప్ప ప్రధాని మోదీ సహా ఇతర ఇండియన్ మినిస్టర్ల నుంచి నేను వినలేదు’ అని ఆ దేశ పార్లమెంట్‌లో ప్రతిపక్షాల ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. కాగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు ఆపకపోతే భారత్‌పై 25% టారిఫ్స్ వేస్తామని ట్రంప్ <<19081934>>హెచ్చరించిన<<>> విషయం తెలిసిందే.
News February 12, 2026
రేపు YCP శాసనసభాపక్ష సమావేశం

AP: వైసీపీ అధినేత జగన్ ఆధ్వర్యంలో రేపు ఆ పార్టీ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు MLA, MLCలతో ఆయన భేటీ కానున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహాలపై జగన్ వారితో చర్చించనున్నట్లు YCP ట్వీట్ చేసింది. ఇవాళ జగన్‌తో పాటు అసెంబ్లీకి వెళ్లిన వైసీపీ సభ్యులు కొంతసేపటికే సభ నుంచి వాకౌట్ చేసిన విషయం తెలిసిందే.
News February 12, 2026
ఇంగ్లండ్‌పై వెస్టిండీస్ విజయం

T20WCలో ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచులో వెస్టిండీస్ 30 రన్స్ తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన WI 20 ఓవర్లలో 196 రన్స్ చేసింది. ఛేదనలో సామ్ కరన్(43*), జాకబ్(33), సాల్ట్(30) మినహా మిగతా ఇంగ్లండ్ బ్యాటర్లు విఫలమయ్యారు. దీంతో ఆ జట్టు 166 పరుగులకే ఆలౌటైంది. వెస్టిండీస్ బౌలర్లలో మోటీ 3, ఛేజ్ 2 వికెట్లు తీశారు. అటు హ్యారీ బ్రూక్ కెప్టెన్సీలో T20ల్లో ఇంగ్లండ్‌కు ఇది తొలి ఓటమి.


