News January 31, 2025
నేటి నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ: నిర్మల్ DEO

నిర్మల్ పట్టణంలోని పంచశీల్ బీఎడ్ కళాశాలలో రెండు రోజులపాటు కెరీర్ గైడెన్స్ కౌన్సిలింగ్ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు డీఈవో రామారావు తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్యాలకు సంబంధించిన ప్రతి ప్రభుత్వ పాఠశాల నుంచి ఒక ఉపాధ్యాయుడు తరగతులకు హాజరుకావాలన్నారు. ఈ శిక్షణ తరగతులు జనవరి 31, ఫిబ్రవరి1 తేదీల్లో కొనసాగుతాయన్నారు. ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News September 15, 2025
భార్యాభర్తలు.. ఇద్దరూ కలెక్టర్లే

ఏపీ చరిత్రలో అరుదైన ఘటన చోటుచేసుకుంది. నెల్లూరు జిల్లా కలెక్టర్‌గా హిమాన్ష్‌శుక్లా పదవీ బాధ్యతలు చేపట్టగా ఆయన సతీమణి కృతికాశుక్లా కూడా నిన్నే పల్నాడు జిల్లా కలెక్టర్‌గా పదవీ బాధ్యతలు చేపట్టారు. 2013 బ్యాచ్‌కు చెందిన ఈ భార్యాభర్తలు ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందిన వారు కాగా మరొకరు హర్యానాకు చెందిన వారు. ఇద్దరూ కుటుంబంతోపాటు వెళ్లి బాధ్యతలు స్వీకరించారు.
News September 15, 2025
ప్రజావాణిలో వచ్చిన ప్రతి దరఖాస్తుకు పరిష్కారం చూపాలి: కలెక్టర్

సమస్యలు పరిష్కరించాలని ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులు పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు. నేడు ఐడీవోసీ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో, జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు నుంచి సమస్యల దరఖాస్తులు స్వీకరించారు. ప్రతి దరఖాస్తు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, పరిష్కారంలో జాప్యం చేయొద్దని అధికారులకు తెలిపారు.
News September 15, 2025
రేపు భారీ వర్షాలు

ఏపీలోని కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాల్లో రేపు పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని APSDMA తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, తిరుపతి జిల్లాల్లో మోస్తరు వానలు పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. కాగా ఇవాళ తూ.గో., ప.గో., కాకినాడ, కోనసీమ జిల్లాల్లో వర్షాలు కురిశాయి.