News May 18, 2024
నేటి నుంచి కాచిగూడ రైలు పునరుద్ధరణ

గుంటూరు నుంచి కాచిగూడ వెళ్లే రైలు(17251)ను ఈనెల 18 నుంచి పునరుద్ధరిస్తున్నట్లు మండల రైల్వే అధికారి శుక్రవారం తెలిపారు. అదేవిధంగా కాచిగూడ నుంచి గుంటూరు వచ్చే రైలు (17252) ఈనెల 19వ తేదీ నుంచి నడుస్తుందని పేర్కొన్నారు. ఇంజినీరింగ్ పనులు జరుగుతున్నందున ఈ రెండు రైళ్లను ఈనెల 31 వరకు రద్దు చేయాలని గతంలో తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు తెలిపారు.
Similar News
News February 22, 2026
నేడు గుంటూరుకు CMచంద్రబాబు రాక

గ్రామీణ డాక్ సేవక్ సమ్మేళనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బొమ్మిడాలనగర్‌లోని సత్యసాయి స్పిరిచ్యువల్ సొసైటీలో ఆదివారం ఈ కార్యక్రమం జరగనుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, పెమ్మసాని చంద్రశేఖర్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఇందులో భాగంగా అతిథులు తపాలా సేవా మూర్తులకు సన్మానం చేయనున్నారు.
News February 22, 2026
ఫిరంగిపురం: కాలువలోకి దూసుకెళ్లిన బైక్.. యువకుడి మృతి

ఫిరంగిపురం మండలం గుండాలపాడు గ్రామంలోని రైస్ మిల్లు వద్ద శనివారం విషాదం చోటుచేసుకుంది. బైక్ అదుపుతప్పి కాలువలో పడిపోవడంతో ఓ యువకుడు మరణించాడు. మునగపాడు గ్రామానికి చెందిన యడ్లపల్లి ప్రభుదాసు (24) తన బైక్‌పై వెళ్తుండగా రాత్రి 9.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. బైక్ అదుపుతప్పి పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లడంతో ప్రభుదాసు అక్కడికక్కడే మృతి చెందాడు.