News December 2, 2024
నేటి నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు
కొత్త రేషన్ కార్డులకు నేటి నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించనుంది. ఈ మేరకు అర్హుల నుంచి సచివాలయ సిబ్బంది దరఖాస్తులను స్వీకరించనున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా 6.50 లక్షలకు పైగా రేషన్ కార్డులున్నాయి. వీరందరూ మార్పులు, చేర్పులు ఈ నెల 28లోపు చేసుకోవచ్చు. ఇప్పటికే కొత్త కార్డుల దరఖాస్తులు 12 వేలకు పైగా పెండింగ్‌లో ఉన్నాయి. త్వరలో ప్రభుత్వం అర్హులందరికీ కొత్తకార్డులు మంజూరు చేయనుంది.
Similar News
News December 26, 2024
శ్రీకాకుళం: బ్యాంకర్ల భాగస్వామ్యంతోనే ఆర్థిక ప్రగతి: కలెక్టర్
జిల్లా స్థాయి సమీక్షా మండలి సమావేశం కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా గురువారం జరిగింది. జిల్లా ఆర్థిక ప్రగతిలో బ్యాంకర్ల భాగస్వామ్యం, సహకారం ఎంతో అవసరమని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఈ సమావేశంలో వివిధ స్వయం ఉపాధి పథకాల అమలు, రుణాలు మంజూరుపై చర్చించారు. ఇందులో జాయింట్ కలెక్టర్ ఫర్మన్ అహ్మద్ ఖాన్ పాల్గొన్నారు.
News December 26, 2024
మెగాస్టార్‌తో అచ్చెన్నాయుడు మటామంతీ
మెగాస్టార్ చిరంజీవితో గురువారం రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ముచ్చటించారు. శంషాబాద్‌లో జరిగిన ఒక వేడుకలో(మంత్రి టీజీ భరత్ కుమార్తె వివాహం)లో చిరంజీవి, అచ్చెన్నాయుడు కలుసుకున్నారు. ఒకరినొకరు స్నేహపూర్వకంగా కరచాలనం చేసుకుని కొద్ది నిమిషాలు మాట్లాడుకున్నారు. ఈ మేరకు చిరంజీవితో అచ్చెన్నాయుడు మాట్లాడుతున్న ఫొటోలు సోషల్ మీడియాలో టీడీపీ కార్యకర్తలు పంచుకున్నారు.
News December 26, 2024
SKLM: పలు రైళ్లకు అదనపు కోచ్‌లు
సంక్రాంతి సీజన్ సందర్భంగా పలు రైళ్లకు అదనపు కోచ్‌లను జత చేస్తున్నట్లు వాల్తేరు డివిజన్ డీఆర్ఎం సందీప్ బుధవారం తెలిపారు. విశాఖ-గుణపూర్-విశాఖ ప్యాసింజర్ స్పెషల్‌కు జనవరి ఒకటి నుంచి 31 వరకు ఒక స్లీపర్ క్లాస్ కోచ్‌ను జత చేస్తున్నారన్నారు. భువనేశ్వర్-తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు జనవరి 4 నుంచి 25 వరకు, తిరుగూ ప్రయాణంలో జనవరి 5 నుంచి 26 వరకు ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జత చేస్తున్నట్లు తెలిపారు.