News January 10, 2026

నేటి నుంచి గుజరాత్‌లో ప్రధాని మోదీ పర్యటన

image

ప్రధాని మోదీ నేటి నుంచి 3 రోజుల పాటు స్వరాష్ట్రం గుజరాత్‌లో పర్యటించనున్నారు. ఇవాళ ఆయన సోమనాథ్ ఆలయానికి చేరుకొని 8pmకు ఓంకార మంత్ర పఠనం చేస్తారు. రేపు ఆలయ రక్షణలో ప్రాణాలు కోల్పోయిన వారిని స్మరిస్తూ శౌర్య యాత్ర, ఆపై బహిరంగ సభలో పాల్గొంటారు. అనంతరం కచ్, సౌరాష్ట్ర ప్రాంతాల కోసం ఏర్పాటు చేసిన ట్రేడ్ షో‌ను ప్రారంభిస్తారు. 12న జర్మనీ ఛాన్స్‌లర్ ఫ్రెడ్రిక్ మెర్జ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు.

Similar News

News February 19, 2026

మే తొలి వారంలో కవిత కొత్త పార్టీ!

image

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ పెట్టనున్నట్లు ప్రకటించారు. మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకొని ప్రకటించనున్నట్లు వెల్లడించారు. పార్టీ పేరులో తెలంగాణ ఉంటుందని చెప్పారు. మరోవైపు అసెంబ్లీ ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచైనా పోటీ చేయొచ్చని ఆమె పేర్కొన్నారు. మొదటి ఛాయిస్ సిద్దిపేట, రెండోది బోధన్ అని చెప్పారు.

News February 19, 2026

పంటల్లో చెదపురుగుల నివారణకు మరికొన్ని సూచనలు

image

పొలం గట్లపై ఉండే చెదపురుగుల స్థావరాలను గుర్తించి నాశనం చేయాలి. సరిగా కుళ్లని సేంద్రియ ఎరువు చెదపురుగులను ఆకర్షిస్తుంది. అందుకే బాగా కుళ్లిన సేంద్రియ పదార్థాన్నే ఎరువుగా వాడాలి. పంట విత్తేసమయంలో KG విత్తనానికి క్లోరిపైరిఫాస్ 6ml కలిపి విత్తనశుద్ధి చేస్తే విత్తనాలను చెద నుంచి కాపాడవచ్చు. చెరకు పంటలో చెదల నివారణకు లీటరు నీటికి మలాథియాన్ 2mlను కలిపి 15 నిమిషాల పాటు ఉంచి తర్వాత మొక్క మొదల్లో వేయాలి.

News February 19, 2026

ధ్యానంతో దైవ దర్శనం సాధ్యమని చెప్పిన మహర్షి

image

ఉపనిషత్తుల్లో పేర్కొన్నవారిలో ఆరుణి మహర్షి ఒకరు. ఆయన గొప్ప జ్ఞాని. ఆయన బోధనలు బృహదారణ్యక, ఛాందోగ్య ఉపనిషత్తులలో కనిపిస్తాయి. ఆయన ఆధ్యాత్మిక గురువు. ఈయన వద్దే సుప్రసిద్ధ యాజ్ఞవల్క్య మహర్షి విద్యను అభ్యసించారు. ఆత్మ, శరీరం, అంతరాత్మతో దేవుడిని తెలుసుకోవచ్చని శిష్యులకు వివరించేవారు. తన కుమారుడైన శ్వేతకేతువుకు తత్త్వమసి వంటి ఆధ్యాత్మిక రహస్యాలను బోధించి, ధ్యానంతో దైవదర్శనం కలిగించారు.