News November 10, 2025
నేటి నుంచి గ్రూప్-3 అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్

TG: నేటి నుంచి ఈ నెల 26 వరకు HYDలోని సురవరం ప్రతాప్ రెడ్డి(పొట్టి శ్రీరాములు) యూనివర్సిటీలో గ్రూప్-3 మెరిట్ అభ్యర్థులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ జరగనుంది. రోజూ 10:30am నుంచి 5.30pm వరకు కొనసాగనుంది. మొత్తం 1,365 పోస్టుల భర్తీకి గత ఏడాది నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే మెరిట్ జాబితా విడుదలైంది. TGPSC <
Similar News
News November 10, 2025
నేటి నుంచి గ్రూప్ -3 పోస్టులకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్

తెలంగాణలో నేటి నుంచి గ్రూప్-3 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. హైదరాబాద్ నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు యూనివర్సిటీలో ఈ నెల 26వరకు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5.30గంటల వరకు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు 2 జిరాక్స్ సెట్లు తీసుకెళ్లాలి.
News November 10, 2025
600 ఉద్యోగాలు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES) 600 సీనియర్ అసిస్టెంట్ కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. BSc, డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు NOV 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC, ST, PwBDలకు రూ.100. వెబ్‌సైట్: www.rites.com/Career. మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 10, 2025
APEDAలో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

APEDAలో 11 బిజినెస్ డెవలప్‌మెంట్ మేనేజర్, అసోసియేట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి సంబంధిత విభాగంలో BSc, MSc (అగ్రికల్చర్, హార్టికల్చర్, వెటర్నరీ సైన్స్, ప్లాంటేషన్, ఫుడ్ ప్రాసెసింగ్, ఫారెన్ ట్రేడ్, పబ్లిక్ పాలసీ, ఫుడ్ సైన్స్/ కెమిస్ట్రీ లేదా బయోకెమిస్ట్రీ, మైక్రో బయాలజీ), PGDM, MBAతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: https://apeda.gov.in/


